రెండు రోజుల్లో 60 సమావేశాలు – పనిమంతుడు రేవంత్ !

దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రమోట్ చేయడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో విస్తృతంగా భేటీలు అవుతున్నారు. తెలంగాణ లో ఉన్న అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇస్తున్నారు. రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి అరవైకిపైగా సమావేశాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి మల్టినేషనల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వీరిలో చాలా మంది తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపించారు. కొంత మంది అధికారిక ప్రకటన చేశారు. మరికొంత మంది తెలంగాణలో పర్యటించేందుకు ఆసక్తి చూపించారు.

దావోస్‌లో ఇప్పుడు చలి కాలం. భారత వాతావరణానికి అలవాటు పడిన వారు.. దావోస్‌లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. అక్కడి చలి వల్ల వెళ్లడం లేదని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ గతంలో చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు అక్కడి చలికే భయపడి వెళ్లడం లేదు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం.. అధికార బృందంతో…. చలిని లెక్క చేయకుండా పెట్టుబడుల వేట సాగిస్తున్నారు. గతంలో కేటీఆర్ కూడా ప్రతీ ఏటా వెళ్లేవారు. ఆయన ఇంత ఎక్కువగా సమావేశాల్లో పాల్గొనేవారు కాదు. కానీ రేవంత్ మాత్రం… తన దావోస్ షెడ్యూల్ మొత్తం పారిశ్రామికవేత్తలతో భేటీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

దావోస్‌లో జరిగే సమావేశాలన్నీ పెట్టుబడులుగా మారవు. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు అదో మంచి మార్కెటింగ్ ప్లేస్. వచ్చే పారిశ్రామికవేత్తలందరి దృష్టిలో తెలంగాణ పడేలా చూస్తే.. ఎప్పటికైనా వారి వ్యాపార విస్తరణ లేదా కొత్త వ్యాపార అవకాశాల కోసం తెలంగాణ ను దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి శక్తివంచన లేకుండా పనిమంతునిగా పని చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close