రాహుల్ గాంధీని తెలంగాణ టూర్‌కు తీసుకొస్తున్న రేవంత్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాస్త కదలిక తీసుకు వచ్చిన పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి మరింత జోష్ నింపేందుకు హైకమాండ్‌ను కూడా రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. దళిత, గిరిజన దండోరా సభను ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న రేవంత్ వచ్చే నెల 17వ తేదీన వరంగల్‌లో సభను ఖరారు చేశారు. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా ఒప్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా ధృవీకరించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తారని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హడావుడి ప్రారంభమయింది.

హైకమాండ్ నుంచి ఈ సభను ఓ బలప్రదర్శన వేదికగా రేవంత్ రెడ్డి వినియోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే ఆదరణను మరింతగా పెంచుకునేందుకు రేవంత్ వ్యూహం పన్నే అవకాశం ఉంది. ఉపఎన్నికలు ఎంత వాయిదా పడితే కేసీఆర్‌కు దళిత వర్గాల నుంచి అంతగా ఒత్తిడి వస్తుందనే రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. వచ్చే నెల పదిహేడో తేదీ లోపు హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో పథకం అమలు చేయకపోతే.. ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ సభలో ప్రత్యేకంగా హైలెట్ చేసి.. కేసీఆర్ మోసం చేశారని ప్రకటించాలని భావిస్తున్నారు.

కొంత మంది కాంగ్రెస్ సీనియర్లు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి కలసి వచ్చే వారితో పోరాటం చేస్తున్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇంకా రేవంత్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాహుల్ గాంధీ వరంగల్ దళిత, గిరిజన దందోరాకు హాజరైతే.. వారంతా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అదే జరిగితే… వారిపై రేవంత్ రెడ్డి పై చేయి సాధించినట్లవుతుంది. రాహుల్ గాంధీ సభతో అటు రాజకీయంగా బలపడటం.. ఇటు పార్టీలోనూ మరింత పట్టు పెంచుకోవడం రేవంత్ రెడ్డికి సులువు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close