హుజురాబాద్‌లో చప్పుడు చేయని పార్టీలు..!

రెండు వారాల క్రితం నేడో రేపో ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేస్తుందని హైరానా పడిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు సీన్ అర్థమైపోయింది. ఇప్పుడల్లా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. అందుకే అందరూ ప్రెస్‌మీట్లతోనే సరి పెడుతున్నారు. నిన్నటిదాకా హోరెత్తిన ప్రచారం ఇప్పుడు సైలెంటయిపోయింది. హుజురాబాద్ మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినాపార్టీ జెండాలు కనిపిస్తున్నాయి కానీ నేతల ప్రచారం మాత్రం. దళిత బంధు ప్రారంభించిన తర్వాత టీఆర్ఎస్ నేతలంతా హైదరాబాద్ వెళ్లిపోయారు. హరీష్ రావు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకున్నా… మళ్లీ ఎన్నికలషెడ్యూల్ వచ్చే వరకూ హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు చక్కబెట్టనున్నారు.

నియోజకవర్గాలకు నియమించిన టీఆర్ఎస్ ఇంచార్జులు కూడా సొంత ఊళ్ల బాట పట్టారు. ఇక ఈటల రాజేందర్ కూడా సైలెంటయ్యారు. ఆయన కూడా ప్రచారాన్ని పూర్తిగా తగ్గించారు. మోకాలి ఆపరేషన్ జరగడంతో ఎక్కువగా ఆయన ప్రచార భారం ఆయన భార్య జమున చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు గురించి ఆలోచిస్తోంది. కొండా సురేఖ పేరును ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు కానీ.. అధికారికంగా ప్రకటించలేదు.

ఈ లోపు కొంత మంది నేతలు దళిత మాదిగ నేతకు టిక్కెట్ ఇవ్వాలని మాణిగం ఠాగూర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ రచ్చ అంతా ఎందుకనుకున్నారేమో కానీ… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడల్లా ఉపఎన్నికల నోటిఫికేషన్ రాదన్న ఈసీ సంకేతాలతో పరుగులు పెట్టిన రాజకీయ పార్టీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close