ఇక ప్రజలతో కలిసి తెరాసపై పోరాటాలకి రేవంత్ రెడ్డి రెడీ

సాక్షాత్ పార్టీ అధ్యక్షుడుకే పార్టీపై ఆసక్తి, దాని మనుగడపై అనుమానాలు ఉన్నప్పుడు ఇక ఆ పార్టీని రక్షించడం ఎవరి తరం? ఇది తెలంగాణాలో తెదేపాను ఉద్దేశ్యించి ఆ పార్టీ నేతలే అనుకొంటున్నా మాటలు. గ్రేటర్ ఎన్నికలు జరగడమే ఆలస్యం అన్నట్లు తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. మున్ముందు ఇంకా ఎంతమంది గోడ దూకేస్తారో తెలియదు కానీ చాలా మంది దూకేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోయినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నిబ్బరం కోల్పోకుండా తెరాసతో ఒంటరి పోరాటం చేయడానికి సిద్దం అవుతుండటం మెచ్చుకోవలసిందే.

ఆయన ఇక నుండి నేరుగా ప్రజల మధ్యకే వెళ్లి స్థానిక సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకొన్న చిన్నముల్కనూరు గ్రామానికి స్వయంగా వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దాని రూపు రేఖలు పూర్తిగా మారిపోయి ఆ గ్రామం దశ తిరుగబోతోందని అందరూ భావించారు. కానీ అంత సంతృప్తికరంగా అభివృద్ధి జరుగలేదనే సంగతి రేవంత్ రెడ్డి గ్రహించారు.

ఆ తరువాత ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడి వారికి న్యాయం కల్పించడానికి ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నారు. స్థానిక పార్టీ క్యాడర్ ని వెంటబెట్టుకొని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడం ద్వారా మళ్ళీ ప్రజల అభిమానం పొంది పార్టీని బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఆయనతో పార్టీ నేతలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారా లేకపోతే తెరాస వశీకరణ మంత్రానికి లొంగిపోయి తెరాసలో చేరిపోతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close