బీజేపీని రేవంత్ అంత తేలిగ్గా తీసుకున్నాడేంటి..?

” బుద్ది ఉన్న వాళ్లు ఎవరైనా బీజేపీలో చేరుతారా..? ” .. బీజేపీలో చేరబోతున్నారా.. అని తనకు ఎదురైన ప్రశ్నలకు.. ఇదీ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. అంతే కాదు.. తాను బీజేపీలో చేరితే.. మోడీని పక్కన పెట్టి.. ప్రధానమంత్రి పోస్టు ఏమీ ఇచ్చేయరు కదా..అని సెటైర్లు కూడా వేశారు. ప్రస్తుతం బీజేపీలో బుద్ది ఉన్న వాళ్లు ఎవరూ చేరరంటూ.. తేల్చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత కాలినడకన తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకున్న రేవంత్.. అక్కడి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. బీజేపీపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేశారు.

ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరిక ప్రభంజనం కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా.. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వచ్చి నేతలు చేరిపోతున్నారు. వారికి బీజేపీలో అంత తీపి వస్తువు ఏమి కనిపిస్తుందో.. కానీ.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు… తమ పార్టీ శాసనసభాపక్షాలను విలీనం చేయడానికే ఏ మాత్రం ఆలోచించడం లేదు. తెలంగాణలోనూ.. పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరికలు సాగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్డి సామాజికవర్గంపై కన్నేసి… ముఖ్యనేతలందర్నీ చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది., ఈ క్రమంలో… రేవంత్ రెడ్డి పేరు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది. పదే పదే.. ఆయన పేరును.. కొంత ప్రణాళికాబద్ధంగా ప్రచారంలోకి పెడుతున్నారు. ఫలితంగా.. రేవంత్ – బీజేపీ కాంబో.. అదే పనిగా హెడ్లైన్స్‌లోకి వస్తోంది.

తాను అదే పనిగా స్పందిస్తే.. మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటారన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి.. ఎప్పుడూ ఓవర్‌గా రియాక్ట్ కాకుండా.., తన పని తాను చేసుకుపోతున్నారు. ఎంపీగా.. తనదైన పద్దతిలో ముందుకెళ్తున్నారు. అయితే.. సందర్భం వచ్చినప్పుడు మాత్రం.. బీజేపీని వదిలి పెట్టడం లేదు. అనుకున్నట్లుగా.. విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదు. రాహుల్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికీ కనీసం తాత్కలిక అధ్యక్ష పదవిని కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో… రేవంత్ కూడా.. తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి.. చాను చెప్పాలనుకున్నది సూటిగానే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close