రేవంత్ పీసీసీ చీఫ్ కాదు.. ప్రచార కమిటీ ఛైర్మన్..!

టీ పీసీసీ చీఫ్ పదవి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తేల్చలేకపోతోంది. రేవంత్ రెడ్డికి కింది స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల మద్దతు లభించినా… పై స్థాయిలో నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. సీనియర్లు.. తాము ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్నామని.. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటన్న చర్చ పెడుతున్నారు. దీంతో హైకమాండ్ పరి పరి విధాలా ఆలోచించి.. చివరికి పీసీసీ చీఫ్‌గా.. మధ్యే మార్గంగా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. జీవన్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ వాది మాత్రమే కాదు. టీఆర్ఎస్‌పై పోరాడుతున్న నేత కూడా. జగిత్యాల ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. వెంటనే ఎమ్మెల్సీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయాలని.. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో జవసత్వాలు వస్తాయని ఆయన నేరుగా తన అభిప్రాయాన్ని మాణిగం ఠాగూర్‌కే చెప్పారు. అయితే ఆయనలా.. ఇతల సీనియర్లు ఆలోచించడం లేదు. దీంతోనే సమస్య వస్తోంది.

చివరికి మధ్యే మార్గంగా… జీవన్ రెడ్డినే పీసీసీ చీఫ్‌ని చేసి.. ప్రచార కమిటీ చైర్మన్‌గా… రేవంత్ రెడ్డిని నియమిస్తే సమస్య పరిష్కారం అవుతుందని హైకమాండ్ ఫార్ములా సిద్ధం చేసింది. అయితే రేవంత్ లేకపోతే.. తాను కోమటిరెడ్డి ఉన్నారు. రేవంత్ ను చీఫ్‌ను చేస్తే.. పార్టీ వీడి పోవడానికి తనకో కారణం లభిస్తుంది. జీవన్ రెడ్డిని చేస్తే.. ఆ చాన్స్ కూడా పోతుంది. అప్పుడు.. వేరే పార్టీలో చేరడానికి సరైన కారణం దొరకదు. అదే సమయంలో… రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తే.. ఆయన పీసీసీ చీఫ్ రేంజ్‌లోనే ప్రభావం చూపుతారు. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ పదవి కన్నా.. ప్రచార కమిటీ చైర్మనే కాంగ్రెస్‌లో పవర్ పుల్‌గా ఉంటారు. పైగా రేవంత్ పై మంచి అభిప్రాయం ఉండి… ఆయన నాయకత్వంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా ఉంటే… రేవంత్ ఉన్నట్లేనని.. హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు.

రేవంత్ రెడ్డి కూడా ఈ ఫార్ములాకు ఓటేశారు. తనకు పీసీసీ చీఫ్ వద్దని.. ప్రచార కమిటీ చైర్మన్ పదవే ఇవ్వమని ఆయన అంటున్నారు. ఈ మేరకు మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో కుండబద్దలు కొట్టారు. తనకు ఏ పదవి కావాలో.. హైకమాండ్ చాయిస్ అడిగితే… ప్రచార కమిటీ చైర్మన్ పదవే కావాలని అడుగుతానని చెబుతున్నారు. దీంతో హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాల మేరకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఫార్ములానే ప్రకటించి.. రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత.. సీనియర్లకు చెక్ పెట్టేందుకు హైకమండ్ పక్కా ప్లాన్ అవలంభించినట్లుగా భావిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి కొడుతున్న మాస్టర్ స్ట్రోక్‌గా అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

గంటా చేరిక ఫైల్ జగన్ వద్ద ఉందట..!

గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీలో యాక్టివ్‌గా మారుతున్నారనో.. లేకపోతే.. ఆయన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేసినా తర్వాత వైసీపీలో చేరుతారని చెప్పడానికో కానీ విజయసాయిరెడ్డి గంటా మెడలో గంట కట్టారు. గంటా శ్రీనివాసరావు...

రూ. ఏడు కోట్లతో సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కొత్త కాన్వాయ్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది వాహనాలతో కూడిన కాన్వాయ్ కోసం రూ. ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టనున్నారు. ఈ మేరకు...
video

‘వ‌కీల్ సాబ్’ పాట‌: ప‌వ‌న్‌ పొలిటిక‌ల్ మైలేజీ కోస‌మా?

https://www.youtube.com/watch?v=SBMZA5-pe30 వకీల్ సాబ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా... ఇది వ‌ర‌కు `మ‌గువ మ‌గువ‌` పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. పింక్ సినిమాకి ఇది రీమేక్‌. `పింక్‌` అనేది అమ్మాయి క‌థ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే వాళ్ల కోణంలో,...

HOT NEWS

[X] Close
[X] Close