కేసీఆర్ పాల‌న‌పై వారం పాటు విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడీ!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద మ‌రోసారి విమ‌ర్శ‌లు ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇవాళ్టి నుంచి ప‌ట్నం గోస పాద‌యాత్ర‌ను ఆయ‌న ప్రారంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. వారం రోజుల‌పాటు మ‌ల్గాజ్ గిరి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలో సాగే ఈ యాత్ర‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమ‌ర్శ‌లుంటాయ‌ని ముందే సంకేతాలు ఇచ్చారు. రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… తెరాస చేసిన పాపాల‌ను క‌డుక్కునేందుకే ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శించారు. త్వ‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు రాబోతున్నాయ‌నీ, గ్రేట‌ర్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసే కుట్ర ఇప్ప‌ట్నుంచే ప్రారంభించార‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం క‌ళ్ల‌కు క‌నిపించేలా చేయ‌డ‌మే ప‌ట్నం గోస ముఖ్యోద్దేశం అన్నారు రేవంత్ రెడ్డి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నిల‌బెట్టుకోలేద‌న్నారు. హైద‌రాబాద్ ప‌రిధిలో కేవ‌లం 108 డ‌బుల్ బెడ్ ఇళ్ల‌ను మాత్ర‌మే క‌ట్టార‌న్నారు. కానీ, ఎర్ర‌వ‌ల్లిలో డ‌బుల్ బెడ్ ఇళ్లు, చింత‌మ‌డ‌ గ్రామానికి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఇస్తార‌ని ఎద్దేవా చేశారు. ఆ గ్రామాల‌కు నిధులు, ప‌థ‌కాలు కేటాయింపుల‌పై త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌నీ, అదే త‌ర‌హాలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల‌పై కూడా ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సు ఉండాలి క‌దా అన్నారు. నువ్వేమ‌న్నా ఎర్ర‌వ‌ల్లి స‌ర్పంచ్ వా, చింత‌మ‌డకు ఎంపీటీసీవా, ఆ రెండు గ్రామాల‌కు మాత్ర‌మే ప‌నిచేస్తావా, మిగ‌తావి క‌నిపించ‌వా అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి ప్ర‌శ్నించారు రేవంత్. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ఏడాదిలోపే నిర్మించుకున్నార‌నీ, ఐదేళ్లు దాటుతున్నా పేద‌ల‌కు ఇళ్లు నిర్మించ‌లేక‌పోతున్నార‌న్నారు.

ఈ సంద‌ర్బంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు రేవంత్. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం దుర్వినియోగం వంటి అంశాల‌పై ఆయ‌న ఎందుకు స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌ర‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎర్ర‌బ‌స్సు త‌ప్ప రైళ్లు తెలీవ‌ని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా రేవంత్ స్పందిస్తూ… కిష‌న్ రెడ్డి, ప్ర‌ధాని మోడీ పుట్ట‌క ముందే తెలంగాణ‌లో రైళ్లు ఉన్నాయ‌ని తెలుసుకోవాల‌న్నారు. ప‌ట్నం గోస‌లో త‌మ దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని ముఖ్య‌మంత్రికీ, గ‌వ‌ర్న‌ర్ కి నివేదిస్తామ‌న్నారు. అయినా స్పందించ‌క‌పోతే పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే రాష్ట్రంలో మ‌రో భారీ ఉద్య‌మాన్ని చేప‌డ‌తా అని చెప్పారు రేవంత్. మొత్తానికి, ప‌ట్నం గోస కార్య‌క్ర‌మం పేరుతో ఈ వారం రోజులూ కేసీఆర్ పాల‌న‌పై ఘాటైన విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడీ అవుతున్నార‌ని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close