స్వ‌ర్గీయ హ‌రికృష్ణ స్మార‌కానికి స్థ‌లం ఇవ్వ‌డం న‌చ్చ‌లేద‌న్న రేవంత్..!

నిజ‌మే, ఈ వ్యాఖ్య చేసింది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డే..! తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో, స‌మైక్య రాష్ట్రం కోసం ఒకే ఒక్క వ్య‌క్తి రాజీనామా చేసి ఆమోదింప‌జేసుకున్నాడ‌నీ, ఆయ‌నే స్వ‌ర్గీయ నంద‌మూరి హ‌రికృష్ణ అన్నారు. ఆయ‌న క‌రుడుగ‌ట్టిన స‌మైక్య‌వాది అన్నారు. ఆయ‌న రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాక‌, తీసుకొచ్చి హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఆయ‌న స్మారక స్థూపం క‌ట్ట‌డానికి వెయ్యి గ‌జాల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చింద‌న్నారు. మ‌న రాష్ట్రం కోసం మ‌న బిడ్డ‌ల చావుల‌కు కార‌ణ‌మైన వ్య‌క్తికి స్మార‌క స్థూపం కోసం న‌గ‌రంలో స్థలం ఇస్తే ఎలా ఉంటుంద‌నీ, తాను టీడీపీ నుంచి వ‌చ్చినా తెలంగాణ బిడ్డ‌గా దీన్ని అడగ‌క పోతే త‌న త‌ప్పు అవుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి. అమెరికాలో జ‌రిగిన ఓ కార్య‌క్రమానికి హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద, అదే స‌మావేశంలో పాల్గొన్న కొంత‌మంది తెరాస నేత‌ల స‌మ‌క్షంలోనే రేవంత్ ఇంకొన్ని విమ‌ర్శ‌లూ చేశారు. యాదగిరిగుట్ట‌ను యాదాద్రిగా మార్చారీ, మ‌న‌కు ఆద్రుల సంస్కృతి లేద‌నీ, సింహాద్రి నారాయ‌ణాద్రి అనేవి ఆంధ్రుల సంస్కృతి అనీ, గుట్టులు అని మాత్ర‌మే ఇక్క‌డ‌ పిల్చుకుంటామ‌న్నారు. యాద‌గిరిగుట్ట ఆగ‌మ‌శాస్త్ర స‌ల‌హాదారుడిగా తెలంగాణ‌తో ఏనాడూ సంబంధం లేని, ఎక్క‌డో గోదావరి జిల్లాలో పుట్టిన చిన జీయ‌రుస్వామి నియ‌మిస్తే యాదాద్రే అవుతుంది త‌ప్ప‌, గుట్ట ఎలా ఉంటుంద‌న్నారు? తెలంగాణ బ‌ద్ధవ్య‌తిరేకి అయిన చిన జీయ‌రు స్వామికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాష్టాంగ న‌మ‌స్కారాలు పెడుతుంటే స‌గ‌టు తెలంగాణ వ్య‌క్తిగా త‌న‌కు బాధ క‌లుగుతోంద‌న్నారు. తెలంగాణ చేనేత‌ల‌కు ఎక్క‌డి నుంచో వ‌చ్చిన హీరోయిన్ స‌మంత‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కేటీఆర్ నియ‌మించార‌న్నారు. ఇవ‌న్నీ ఆలోచించాల‌నీ, పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో ఇప్పుడేం జ‌రుగుతోందో విజ్ఞులు విశ్లేషించాల‌న్నారు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఆలోచ‌న చేయాల‌నే కాన్సెప్ట్ లో రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కానీ, స్వ‌ర్గ‌య‌ హ‌రికృష్ణ స్మార‌క స్థూపం అంశ‌మై రేవంత్ స్పంద‌న‌ను ఆంధ్రాతోపాటు, తెలంగాణ‌లో ఉన్న టీడీపీ శ్రేణులు కూడా కొంత నొచ్చుకునే అవ‌కాశం ఉంది. రేవంత్ టీడీపీ నుంచి వెళ్లిపోయినా… ఆయ‌నంటే ఒక సాఫ్ట్ కార్న‌ర్ టీడీపీ అభిమానుల్లో చాలామందిలో ఉంది. ఇప్పుడీ వ్యాఖ్య‌ను వారు ఎలా తీసుకుంటారో చూడాలి. చిన‌జీయ‌రు స్వామి ఆంధ్రుడు అనేది కూడా స‌రైంది కాద‌నే అనాలి! స్వాముల‌కు కూడా రాష్ట్రాలు, ప్రాంతాలు ఆపాదించ‌డం స‌రైందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టిస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

“కాపు రిజర్వేషన్ ఉద్యమం” కాడి దించేసిన ముద్రగడ..!

గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని... ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు...

HOT NEWS

[X] Close
[X] Close