మంత్రుల ఇళ్ల ముందు ధ‌ర్నాలు, స‌డ‌క్ బంద్… జేయేసీ యాక్ష‌న్ ప్లాన్‌!

ఆర్టీసీ జేయేసీ మ‌రోసారి త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మాల కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది. ఆర్టీసీ జేయేసీ నాయ‌కులు, విప‌క్షాల నాయ‌కులు ఆదివారం స‌మావేశ‌మై వ‌చ్చేవారంలో చేప‌ట్టాల్సిన కార్యాక్ర‌మాల‌ను నిర్ణ‌యించారు. సోమ‌వారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. 13, 14వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ని క‌లిసి ఫిర్యాదు చేయ‌బోతున్నారు. ఇక‌, ఈ నెల 18న స‌డ‌క్ బంద్, జైల్ భ‌రో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. శ‌నివారం జరిగిన ఛ‌లో ట్యాంక్ బండ్ కార్య‌క్ర‌మంలో గాయ‌ప‌డ్డ మ‌హిళ‌లంతా మ‌హిళా క‌మిష‌న్ కి వెళ్లి ఫిర్యాదు చేయాల‌ని కూడా నిర్ణ‌యించారు. దీంతోపాటు, జేయేసీ కీల‌క నేత‌లు ఒక‌రోజు నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌బోతున్నారు.

జేయేసీ క‌న్వీన‌ర్ అశ్వ‌త్థామ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఛ‌లో ట్యాంక్ బండ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌నీ, అయితే దీన్లో ప్ర‌జా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు మాత్ర‌మే పాల్గొన్నార‌నీ, మావోయిస్టులు క‌లిసి వ‌చ్చార‌ని పోలీసులు త‌ప్పుడుగా ఆరోపించ‌డం స‌రికాద‌న్నారు. తాము చేప‌ట్ట‌బోతున్న దీక్ష‌ల‌కు అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుతామ‌న్నారు. న్యాయ‌స్థానం ఆదేశించిన‌ట్టుగా వెంట‌నే త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ చూపాల‌న్నారు. హైకోర్టు తీర్పు రాకుండానే సుప్రీం కోర్టుకు వెళ్తామంటూ ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించ‌డం స‌రైంది కాద‌న్నారు. క‌నీసం ఎమ్మెల్యేలు, మంత్రులైనా స్పందించి.. కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే విధంగా సీఎం మీద ఒత్తిడి తేవాల‌న్నారు.

మ‌రోవారం పాటు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ను జేయేసీ మ‌రోసారి ప్ర‌క‌టించేసింది. ఇలా కార్యాచ‌ర‌ణ‌ను వ‌రుస‌గా ఇలా ప్ర‌క‌టించ‌డం ఇది రెండోసారి. గ‌త‌వారంలో అనుకున్న‌ట్టుగా నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌న్నీ చేశారు. కానీ, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. ముఖ్య‌మంత్రి వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాలేదు. స‌మ్మె ముగింపున‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి ప్ర‌య‌త్నాలుగానీ, కార్మికుల స‌మ్మె తీవ్ర‌త‌ను ఒత్తిడి భావించి స్పందంచ‌డం‌గానీ లేదు. న్యాయ‌స్థానంలో మాత్ర‌మే కార్మికుల స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం దిశ‌గా కొంతైనా ముంద‌డుగు ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాబోయే వారం కూడా ఆర్టీసీ కార్మికుల నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌తో హోరెత్తే ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close