నాని కూడా ‘నో’ చెప్పేశాడు

‘గీత గోవిందం’.. వంద కోట్ల సినిమా. ఇలాంటి హిట్టు కొట్టిన త‌ర‌వాత కూడా ప‌ర‌శురామ్ జాత‌కం ఏమాత్రం మార‌లేదు. ఈ సినిమా విడుద‌లై యేడాది దాటినా, ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ర‌శురామ్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. క‌నీసం త‌నకు ఓ హీరో కూడా దొర‌క‌లేదు. ప‌ర‌శురామ్ ఓ క‌థ త‌యారు చేసుకుని మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. కొన్ని రోజులు తిప్పించుకున్న త‌ర‌వాత‌.. మ‌హేష్ ‘నో’ అన్నాడు. అఖిల్ దగ్గ‌ర‌కూ ఈ క‌థ వెళ్లింది. కానీ కుద‌ర్లేదు. ఆ క‌థ ప‌క్క‌న పెట్టేసి ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ లైన్ రాసుకుని నాని కి చెప్పాడు. నాని ‘చూద్దాం.. చేద్దాం’ అంటూ వ‌చ్చాడు. ఇప్పుడు తాను కూడా సైడ్ అయిపోయిన‌ట్టు టాక్‌. ఈ క‌థే… విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని – విజ‌య్ ‘ఇది గీతా గోవిందం లానే ఉంది క‌దా’ అంటూ ప‌క్క‌న పెట్టేశాడ‌ని టాక్‌. అలా.. వంద కోట్ల ద‌ర్శ‌కుడు సైతం – హీరోలు దొరక్క స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ప‌ర‌శురామ్ టార్గెట్ పెద్ద హీరోల‌తో సినిమా. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అంత‌కంటే ఎక్కువ రేంజ్ ఉన్న హీరోల‌తోనే సినిమా చేద్దామ‌నుకుంటున్నాడు. కాక‌పోతే.. ఆ జోన‌ర్‌లో హీరోలంతా బిజీ బిజీగా ఉన్నారు. ప‌ర‌శురామ్ ఓ మెట్టు దిగితే – సినిమాలు చేయ‌డానికి హీరోలు రెడీగానే ఉన్నారు.కానీ.. ప‌ర‌శురామ్ మాత్రం ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. అందుకే ఈ గ్యాప్ అలా పెరుగుతూ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close