మేడారం టెండర్ల విషయంలో కొండా మురళి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టెండర్లను పారదర్శకంగా నిర్వహించారని ..దక్కించుకున్నవారు పొంగులేటికి తెలిసిన వాళ్లు అయితే ఆయనకేం సంబంధమని రేవంత్ అసంతృప్తిగా ఉన్నారు. కొండా మురళి తమ వారికి కాంట్రాక్ట్ దక్కలేదన్న కారణంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
మేడారం పనులను రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేడారం జాతర జనవరి నెలాఖరులో జరగనున్నాయి. అంటే మూడు నెలల్లోనే పూర్తిగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి చేత కాలేదన్న విమర్శలు వస్తాయి. మొత్తం అక్కడ కొత్తగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు టెండర్ల పేరుతో అడ్డం పడితే పనులు ఆలస్యం అవుతాయని అంటున్నారు. అందుకే.. ఈ వ్యవహారంలో కొండా మురళిదే తప్పు అని హైకమాండ్ కు నివేదిక పంపినట్లుగా చెబుతున్నారు.
కొండా సురేఖ దంపతుల వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. వారు బెదిరింపుల్నే నమ్ముకుంటున్నారని .. చివరికి ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితంగాఉండే వేం నరేందర్ రెడ్డిపైనా అదే ప్రయోగం చేశారని అంటున్నారు. అయితే కొండా సురేఖకు రేవంత్ మొదటి నుంచి అండగా ఉంటున్నారు. కానీ ఆయనను మాత్రం.. కొండా దంపతులు లెక్క చేస్తున్నట్లుగా లేదు.