కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన పంచాయతీపై రేవంత్ రెడ్డి సెటైరిక్ గా స్పందించారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ సూటిగానే బీఆర్ఎస్ పంచాయతీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని..ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారన్నారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారన్నారు.
అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు ..పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనన్నారు. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు ..అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాననని ప్రశ్నించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా ..వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే… లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారని విమర్శఇంచారు.
మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా అని ప్రశ్నించారు. దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో… మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి..మాకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు ..కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది..ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుందని స్పష్టం చేశారు.