ఏడాది యాత్ర 3: పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మే 23 ఆయన జీవితంలో మరపురాని రోజు. తాను ముఖ్యమంత్రి కావడమే జీవిత ధ్యేయమని చెప్పుకుని సాధించిన రోజు. ఆ రోజు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మే30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఏడాది పాలనపై చేస్తున్న నిష్ఫాక్షిక విశ్లేషణలో మూడో కథనం…ఆయన పాలనా వ్యవస్థలో ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి..!

ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా అధికార వ్యవస్థ మార్పు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవుతాననే గట్టి నమ్మకంతో పాలనా వ్యవస్థ ఎలా ఉండాలన్నదానిపై ముందుగానే ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం.. వాలంటీర్లు, గ్రామ సచివాయాల వ్యవస్థలను.. రూపొందించారు. అధికారం చేపట్టిన వెంటనే… జగన్మోహన్ రెడ్డి వీటిని ఆచరణలోకి తీసుకు వచ్చారు. వారి ద్వారా పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా సాయం కావాలంటే.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలనే భావన పోవాలని… ప్రభుత్వం వారి ఎదుటే ఉండాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాలంటీర్ల పనితీరు ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉండగా.. గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.

యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌తో పథకాల డోర్ డెలివరి..!

ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తామని.. ప్రజలెవరూ.. ప్రభుత్వ సాయం కోసం బయటకు రావాల్సిన పని లేదని.. .జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో చెప్పారు. దానికి తగ్గట్లుగా ఆయన అధికారంలోకి రాగానే.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించారు. వారికి సాంకేతిక సాయం అందించారు. ఫోన్లు ఇచ్చారు. ఆ యాభై ఇళ్ల పరిధిలోని ప్రభుత్వ లబ్దిదారులందర్నీ కనిపెట్టుకుని.. వారికి కావాల్సిన సాయం చేసేలా వాలంటీర్లను తీర్చిదిద్దారు. అంతే కాదు.. ప్రభుత్వానికి కరోనా లాంటి కష్టాలు వచ్చినప్పుడు.. వారితో యాక్టివ్‌గా ప్రభుత్వం పని చేయించుకుంటోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇప్పుడు ప్రతి యాభై ఇళ్లకు ఉన్నారు. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్లను వారు డోర్ డెలివరీ చేస్తున్నారు. ముందు ముందు రేషన్ సహా… ప్రభుత్వం తరపున అన్ని కార్యక్రమాలను ఇళ్లకు తీసుకెళ్లనున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా వాలంటీర్లపై అభిమానం చూపిస్తూంటారు. ఈ వాలంటీర్ వ్యవస్థ నియామకాల్ని పర్యవేక్షించిన విజయసాయిరెడ్డి.. 90 శాతం మంది తమ పార్టీ వారికే అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చారు. తమ పార్టీకి చెందిన వాలంటీర్లు.. ప్రజలకు మంచి సేవలు చేసి.. తమ పార్టీకి మంచి పేరు తెస్తారని ముఖ్యమంత్రి భావిస్తూ ఉండవచ్చు.

ఇంటి పక్కనే ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయం..!

ముఖ్యమంత్రి కొత్తగా ఆలోచించిన మరో వ్యవస్థ… గ్రామ, వార్డు సచివాలయాలు. ఇప్పటి వరకూ గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు …ప్రభుత్వ పథకాలు ఇతర అవసరాలు తీర్చేవి. అయితే.. అది సరిపోదనుకున్న ముఖ్యమంత్రి.. గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. పట్టణాల్లో వార్డుకు ఓ సచివాలయం ఏర్పాటు చేశారు. నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారి సేవలు గాడిన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఎలాంటి సేవ కావాలన్నా… ఒక్క గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్తే పరిష్కారమయ్యేలా ఏర్పాట్లు చేశారు. వీటిల్లో 500కిపైగా పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 15,002 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా.. ఏయే సేవలను ఎన్ని గంటల్లో, రోజుల్లో అందిస్తామో సిటిజన్ చార్టర్‌ను పెట్టారు. . అత్యధిక సేవలు 72 గంటల్లో అందుతాయి. రేషన్ కార్డు కావాలన్నా.. పించన్ కావాలన్నా… మరో అవసరం ఉన్నా.. గ్రామ సచివాలయానికి వెళ్లి ధరఖాస్తు చేస్తే పరిశీలించి ఇచ్చేస్తారు. గ్రామ సచివాలయాల్లో దాదాపుగా లక్షన్నర మందిని నియమించారు.

మూడో జాయింట్ కలెక్టర్ వ్యవస్థతో అన్నింటిపై పర్యవేక్షణ..!

ప్రత్యేకంగా మూడో జాయింట్ కలెక్టర్‌ను నియమించి ఈ వ్యవస్థలన్నింటినీ పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాకు ఇప్పటికి ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అదనంగా మరో పదమూడు జాయింట్ కలెక్టర్లను నియమించారు. ముగ్గురికీ బాధ్యతలు విడగొట్టారు. మొదటి జాయింట్ కలెక్టర్ కు రైతు భరోసా, రెవెన్యూ బాధ్యతలు ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించే జేసీ పదవిని కొత్తగా సృష్టించారు. సీనియర్ అధికారులతోనే భర్తీ చేస్తున్నారు. మూడో జేసీ ఆసరా పథకాన్ని పర్యవేక్షిస్తారు. ప్రజల వద్దకు పాలన అనేది మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించాలని భావిస్తున్నారు. ఈ మూడో జాయింట్ కలెక్టర్ల వ్యవస్థ ప్రజల వద్దకు మరింత సమర్థవంతంగా పాలనను తీసుకెళ్తుందని నమ్ముతున్నారు.

Read Also : ఏడాది యాత్ర – 2 : కక్ష సాధింపుల పాలన..!

Read Also : ఏడాది యాత్ర 1 : బలంగా సంక్షేమ సంతకం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close