ఉన్నతాధికారవర్గాల ప్రక్షాళన..! జగన్ టీం రెడీ..!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన అధికార యంత్రాంగంతో ప్రత్యేకమైన జట్టును ఇప్పటికే ఫైనల్ చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీ నేతలు, మాజీ అధికారులు ఈ టీం ఏర్పాటు పై హోంవర్కు పూర్తి చేశారు. ముందు రాష్ట్ర స్థాయిలోని వివిధ కీలక శాఖలతో పాటు పోలీసు శాఖలోని డీజీపీ, ఇంటిలిజెన్స్ బాస్‌లను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

అజేయకల్లామే అధికారవర్గాల్లో అధికారకేంద్రం..!

ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు ఉన్నతాధికారులు మారబోతున్నారు. జగన్ ప్రమాణస్వీకారం తర్వాత జూన్ ఒకటో తేదీ తర్వాత ఈ మార్పులు జరగబోతున్నాయి. ఎన్నికల కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యల్.వి. సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించబోతున్నారని చెబుతున్న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం నేతృత్వంలో పని చేయాలని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక పోలీసు శాఖలో డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ను మార్చాలని నిర్ణయానికి వచ్చారు. ఆయన స్థానంలో గౌతం సవాంగ్ పేరు ఖరారయింది. ఇప్పటికే గౌతం సవాంగ్ .. చార్జ్ తీసుకున్నట్లుగా.. విధులు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రమాణస్వీకార భద్రతా ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న గౌతం సవాంగ్ వెళ్లి జగన్ ను కలుసుకుని అభినందనలు తెలిపారు. చంద్రబాబు హయాంలోనే డీజీపీ రేసులో సవాంగ్ పేరు కూడా ప్రచారం జరిగినప్పటికీ.. ఆర్.పి.ఠాకూర్ కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.

సవాంగ్‌కు డీజీపీ ..! ఇంటిలిజెన్స్‌కు రాజేంద్రనాథ్ రెడ్డి..!

ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్న ఎబీ వెంకటేశ్వరరావు పై ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్ ను నియమించింది. ఎబీ వెంకటేశ్వరరావుకు ఎసీబీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ డీజీ వంటి కీలక పోస్టుల కోసం గతంలో విజయవాడ సీపీగా పని చేసిన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి, పి.యస్.ఆర్. ఆంజనేయులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజేంద్రనాధ్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. విజయవాడ సీపీగా పీవీ సునీల్ కుమార్ పేరు వినిపిస్తుంది. ఇక వీరితో పాటు పలు జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, సీఐడీ లాంటి విబాగాలకు అధిపతులను కూడా మార్చనున్నారు. రాష్ట్రస్థాయి పోస్టింగ్ ల పై తొలుత దృష్టి సారించి, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.

ఢిల్లీ సర్వీసులకు కొంత మంది ఉన్నతాధికారులు..!

పలు కీలక శాఖల అధిపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నియామకం పై కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమితులు కానున్న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం బదిలీలను పర్యవేక్షిస్తున్నారు. కీలక శాఖల అధిపతులుగా తమ ఆలోచనలకు అనుగుణంగా నడిచేవారిని నియమించుకునేందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. ఆయా అధికారుల ట్రాక్ రికార్డును కూడా తెప్పించుకుంటున్నారు. వారి రికార్డు ఆధారంగానే పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సన్నిహితంగా పని చేసిన వారికి అప్రాధాన్య పోస్టులు దక్కుతాయని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close