చైతన్య : కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉంటే లొంగిపోవాల్సిందేనా..? పోరాడలేమా..?

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే.. ఏపీ సమస్యల కోసం.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేయడం… ఆహ్వానించదగ్గ విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై పట్టుదలతో ఉన్నారు. తొలి సమావేశంలోనే “అవసరమైతే” రాజీనామాలకు సిద్ధంగా ఉండమని కూడా సూచించారు. అందుకే చాలా మందికి ఆశలు పెరిగాయి. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణమెజార్టీ ఉంటే ఏమి.. పోరాడి సాధిస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన తొలి మాటలే ప్రజలకు షాక్ తగిలేలా ఉన్నాయి.

అధికారం కోసం పోరాడినట్లుగా… ప్రత్యేకహోదా కోసం తెగించి పోరాడలేరా..?

కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌కు పూర్తి మెజార్టీ రావడం ఆంధ్రుల ఖర్మ అని జగన్మోహన్ రెడ్డి తేల్చడం.. ఓ రకంగా నిజమే. ఎందుకంటే… భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఏమీ లేదు. ఏమైనా వస్తుందన్న ఆశ కూడా లేదు. పైగా.. తనకు ఎక్కడికెక్కడ ఊడ్చి ఎంపీ సీట్లన్నీ ఇచ్చి… ఉత్తరాది ఆయనను పదే పదే ప్రధానిని చేస్తోంది. అలాంటప్పుడు.. తనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా… ఒక్క రూపాయి… ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా.. అవి ఉత్తరాది రాష్ట్రాలకే పంపుతారు. అదే ఆయనకు నిజమైన హిందూస్థాన్. డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా అదే చెప్పారు. హిందీ రాష్ట్రాలతోనే దేశం ఏర్పడలేదని.. తేల్చారు. కానీ మోడీలో ఆ స్ఫూర్తి ఉందా..? అంటే… లేదనే .. గత ఐదేళ్ల పాలనా కాలంలో.. దక్షిణాదిపై చూపించిన వివక్ష స్పష్టం చేసింది.

చంద్రబాబు కన్నా ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్తే “హోదా” వస్తుందా..?

టీడీపీ అధినేత చంద్రబాబు… తాను ఐదేళ్ల కాలంలో 29 సార్లు వెళ్లానని… అయినా విభజన హామీలపై కేంద్రం కనికరించలేదని పదే పదే వాపోతూంటారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా… అచ్చంగా అలాగే మాట్లాడారు. తాను మరో ఐదేళ్ల కాలంలో 30, 40 సార్లు ఢిల్లీ వస్తానని.. వచ్చిన ప్రతీ సారి… మోడీని కలిసి.. ప్రత్యేకహోదా ఇవ్వాలని అడుగుతానని.. ఆయన ఎప్పుడో ఓ సారి ఇస్తారని చెప్పుకొచ్చారు. అంటే… జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు కన్నా ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్తానని చెప్పారు కానీ… హోదా సాధిస్తానని మాత్రం చెప్పలేకపోయారు. ఇది ఓ రకంగా ప్రజల్ని నిరాశ పరిచేదే.

పోరాడితే పోయేదేం లేదు..! బానిస సంకెళ్లు తప్ప..!

ప్రత్యేకహోదా అనేది… పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీ. దాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. లేకపోతే.. వ్యవస్థల మీదే నమ్మకం పోతుంది. అలాంటి పరిస్థితితే దక్షిణాదిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కుల కోసం.. కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరాటంలో నిజాయితీ ఉంటే.. ఫలితాలు వస్తాయి. చంద్రబాబు పోరాటం.. రాజకీయ పోరాటం అని ప్రజలు గుర్తించారు. అది రాష్ట్రం కోసం చేసిన పోరాటంగా.. ఎవరూ భావించలేదు. ఆ కారణంగానే… ఆయనను ప్రజలు తిరస్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి… ప్రత్యేకహోదా కోసం.. ఆ స్థాయి రాజకీయ పోరాటం కాదు కానీ.. నిజాయితీ అయిన పోరాటం చేయాల్సి ఉంది. లేకపోతే… ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close