అది బిర్యానీ మీటింగే.. గాలి తీసేసిన ఆర్జీవీ, పేర్ని నాని !

సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి ఏదో పరిష్కారం వచ్చేస్తుందని ఆర్జీవీ – పేర్ని నాని భేటీపై మీడియా హైప్ క్రియేట్ చేసింది. కానీ చివరికి ఇద్దరూ లంచ్‌కు ముందు రెండు గంటలు.. లంచ్‌ తర్వాత రెండు గంటలు సమావేశమై తమ చేతుల్లో ఏమీ లేదని ఒకరికొకరు చెప్పుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే మధ్యలో లంచ్ మాత్రం కలిసే చేశారు. మంచి రొయ్యల వేపుడు, మటన్, చికెన్‌లతో ప్లెయిన్ బిర్యానీ ఆర్జీవీకి మంత్రి వడ్డించారు. అదొక్కటే చర్చల ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచినట్లుగా కనిపిస్తోంది.

మీటింగ్ తర్వాత ఫిల్మ్ మేకర్‌గా తను చెప్పాలనుకున్నది చెప్పడానికి మాత్రమే వచ్చానని.. ఇంకేవిషయాలతో తనకు సంబందం లేదని ఆర్జీవీ చెప్పారు. టిక్కెట్ రేట్ల నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. సమస్య పరిష్కారం కావాలని..అది తన చేతుల్లో లేదని మీడియాకు చెప్పి వర్మ వెళ్లిపోయారు. తర్వాత మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని .. టిక్కెట్ రేట్ల అంశంపై ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలంటే ప్రభుత్వం కమిటీ వేసిందని ఆ కమిటీకి చెప్పుకోవాలన్నారు. ఆ కమిటీలో తాను భాగం కాదన్నారు. దాంతో ఆర్జీవీ తో భేటీసో అసలు సబ్జెక్టే లేదని ఆయన చెప్పిటనట్లయింది. అంతే కాదు ఆర్జీవీ వాదనకు కౌంటర్‌గా.. తాము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని.. సినిమాటోగ్రఫీ చట్టం గురించి చెప్పారు.

అంటే ఇద్దరూ ఎవరి వాదన వారు వినిపించారు.. కానీ ఒకరి వాదనను ఒకరు అంగీకరించలేదన్నమాట. అయితే చర్చలు మాత్రం సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. వంద శాతం సంతృప్తినిచ్చిందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. బహుశా ఆ సంతృప్తి వర్మకు.. లంచ్ విషయంలో వచ్చి ఉంటుందన్న సెటైర్లు సహజంగానే పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close