ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్‌పై ప‌డ్డాడా?

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌… ఇదెప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌రుస‌టి రోజు నుంచీ… ఈ టాపిక్ వ‌స్తూనే వుంది. తేజ ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. ఆ త‌ర‌వాత వి.ఎన్‌.ఆదిత్య పేరు వినిపించింది. ఇద్ద‌రూ ఈ విష‌య‌మై నోరు మెద‌ప‌లేదు. అయితే ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ మాత్రం ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ప‌నులు మొద‌లెట్టేసిన‌ట్టు టాక్.

వ‌ర్మ‌కి మెగా కుటుంబం అంటే.. ఎందుకో మంట‌. అంద‌రితోనూ ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా తీశాడు. రేపే జ‌నం మీద‌కు వ‌దులుతున్నాడు. ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ పై ప‌డ్డాడు.చిరుకుటుంబ ఆధిపత్య ధోర‌ణి వ‌ల్లే ఉద‌య్ కిర‌ణ్ కి అవ‌కాశాలు రాకుండా పోయాయ‌ని, బంధుప్రీతి వ‌ల్ల ఉద‌య్‌కిర‌ణ్ జీవితం స‌ర్వ‌నాశ‌నం అయ్యింద‌ని ఓ వ‌ర్గం చెబుతూ ఉంటుంది. దాన్నే ఇప్పుడు వ‌ర్మ హైలెట్ చేసి సినిమాగా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఏటీటీ వేదిక చేతిలో ఉంది. త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాలు తీయ‌గ‌ల టెక్నిక్ వుంది. ఎలాంటి సినిమా తీసినా వివాదం చేసి, క్యాష్ చేసే తెలివితేట‌లున్నాయి. ఇంకేం కావాలి? అందుకే.. వ‌ర్మ త‌దుప‌రి ప్రాజెక్టు ఇదే కావొచ్చ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close