జీడీపీ, చైనా కాదు.. రియానే మీడియాకు పెద్ద సమస్య..!

మీడియా అంటే ఏమిటి..? దానిలో జాతీయ మీడియా అనే హోదా ఉంటే ఏం చేస్తారు..? ఈ రెండు ప్రశ్నలకు ప్రస్తుతం జాతీయ మీడియా సమాధానం ఇస్తోంది. మీడియా అంటే.. కేవలం ప్రజల్ని ఎంటర్‌టెయిన్‌ చేయడం… జాతీయ మీడియా అంటే… జాతీయ స్థాయిలో ఎంటర్‌టెయిన్‌ చేసే వారి వివరాలను హైలెట్ చేయడం.. ఈ అర్థాల ప్రకారమే.. జాతీయ మీడియా చెలరేగిపోతోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లేవీ.. తమకు పట్టవని చెబుతూ.. రోజువారీ ప్రసారాలను పూర్తిగా రియా చక్రవర్తి చుట్టూ తిప్పేస్తున్నాయి. సొంత ఇన్వెస్టిగేషన్ చేసి.. శిక్షలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి.

సుశాంత్ సింగ్… ఆత్మహత్య ఘటన జరిగినప్పటి నుండి సోకాల్డ్ నేషనల్ మీడియాకు.. రియా తప్ప.. మరో వార్త కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతోంది. కాల్పులు కూడా జరిపింది. ఇది చైనా దుస్సాహసం. సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కానీ.. మీడియా పట్టిచుకోవడం లేదు. అదే సమయంలో… దేశంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా మారింది. జీడీపీ మైనస్ 24 శాతానికి పడిపోవడం అంటే.. ఎంత ప్రమాదకరమో… దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో.. ఆర్థిక రంగంలో కామన్‌సెన్స్ ఉన్నవారికి తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలను లైట్ తీసుకున్న మీడియా… రియా చక్రవర్తిని వేటాడటంలో బిజీగా ఉంది.

ఇప్పుడు రానున్న రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని.. మీడియా చెలరేగబోతోంది. ఇప్పటికే రియా … నేషనల్ నార్కొటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో బాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పిందని.. ప్రచారం ప్రారంభించేశారు. రేపట్నుంచి వారికి నోటీసులు.. వీరికి నోటీసులు అని బ్రేకింగ్ న్యూస్‌లు వేసుకుని.. అర్థం పర్థం లేని అరుపులతో టైం పాస్ చేసేస్తారు. ప్రజలకు వినోదాన్ని పంచుతారు. కానీ..దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై… ప్రజలకు అవగాహన కల్పిస్తారు..? నిజాలు ఎవరు చెబుతారు..? సినిమా నటులపైనే కాన్‌సన్‌ట్రేట్ చేస్తే ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి అర్థం ఉంటుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి రజనీకాంత్ ఔట్

టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన...

అమరావతికి మద్దతుగా హైకోర్టులో జనసేన అఫిడవిట్..!

అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది....

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

HOT NEWS

[X] Close
[X] Close