కొత్తపలుకు : ఏపీ విషయంలో విద్యావంతులు మాట్లాడాలంటున్న ఆర్కే..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే… ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాస్త సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. పత్రికలో కానీ… తన స్వంత అభిప్రాయాల విషయంలో కానీ.. గతంలో.. చూపించినంత తీవ్రమైన వ్యతిరేకతను ఏమీ చూపించడం లేదు. అయితే తొలిసారి.. తన వారాంతపు ఆర్టికల్… “కొత్తపలుకు”లో మాత్రం.. ఒక్క సారిగా… తను మాత్రమే కాదు.. విద్యావంతులు సైతం గళమెత్తాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి రెండు నెలల పాలనలో.. ఏపీ.. ఎంత వెనక్కిపోయిందో.. వివరింంచేందుకు ప్రయత్నించి.. ఇంకా ఆలస్యం చేస్తే… భావితరాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని.. తేల్చి చెప్పేశారు.

కేవలం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే.. ఏపీ మొత్తాన్ని జగన్ సర్వనాశనం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక రంగ ప్రముఖులతో.. ఆర్కే కూడా జత కట్టారు. “ఈ విషయంలో మేధావులు మౌనాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైందని” పిలుపునిచ్చారు. స్వయంగా అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రతి రోజూ అవినీతి గురించి మాట్లాడటం వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటోందన్న విషయాన్ని కూడా.. ఆర్కే నేరుగానే తన ఆర్టికల్ లో చెప్పారు.

ఐఏఎస్ అధికారులపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వ్యవహారాలను కూడా.. నిర్మొహమాటంగా.. కొత్తపలుకులో బయటపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వివిధ సందర్భాల్లో అడ్డుకున్న అధికారులపై సాధిస్తున్న కక్ష సాధింపు వ్యవహారాల్ని.. విశ్లేషించి… కొత్త విషయాలను బయటపెట్టారు. అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న అహ్మద్‌బాబును ఓ సందర్భంలో…అడ్డుకున్నారు. అందుకే జగన్‌.. సీఎం అయ్యాక నెల రోజులు దాటినా పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీంతో జీతంపై ఆధారపడి బతికే తనకు పోస్టింగ్‌ ఇవ్వకపోతే కష్టంగా ఉంటుందని అహ్మద్‌బాబు విజ్ఞప్తి చేయగా అదే విషయాన్ని పేర్కొంటూ ఆయనకు పోస్టింగ్‌ ఇస్తూ జీవో జారీ చేశారట. డజనుకు పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదనే విషయాన్ని ఆర్కే గుర్తు చేస్తున్నారు.

పారిశ్రామికవేత్తల విషయంలో… పెట్టుబడుల విషయంలో.. ఏపీ గురించి బయట జరుగుతున్న చర్చను.. ఆర్కే కొత్తపలుకులో బయట పెట్టారు. చాలా వరకూ.. అందులో వాస్తవమే ఉంది. చేయాల్సిన విధ్వంసం అంతా చేసి.. చివరికి… ఏపీలో.. పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మాటల్లో చెబితే… ఎవరూ రారు కదా..! అదే విషయాన్ని ఆర్కే చెప్పకనే చెప్పారు. ఏపీకి జరుగుతున్న నష్టాన్ని సంపూర్ణంగా వివరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com