ఆ ఉత్తమ కానిస్టేబుల్ చెత్తే..! మిగతా దొరికిన దొంగలెందుకు దొరలు..!?

ఆగస్టు 15వ తేదీన ఉత్తమ కానిస్టేబుల్‌గా అవార్డు అందుకున్న తిరుపతి రెడ్డి 16వ తేదీన ఏసీబీకి చిక్కాడు. అంతే.. మీడియా అంతా వెర్రెత్తిపోయింది. ఉత్తమ కానిస్టేబుల్… ఒక్క రోజునే.. అవినీతిలో కూరుకుపోయాడని… కొందరు… అవార్డుల్ని.. ఇలా.. అవినీతి చేసిన డబ్బులతో కొనుగోలు చేశారని.. మరికొందరు… విశ్లేషించారు. కానీ.. అసలు లోపం ఎక్కడ ఉంది.. ? ఈ కానిస్టేబుల్ ఒక్కడేనా… దొరికిన దొంగ.. . దొరకని వాళ్లంతా.. దొరలేనా..? దొరికినా మీడియా అటెన్షన్ లో పడని వాళ్లూ దొరలేనా…? పక్కాగా దొరికిపోయి.. నీతులు చెబుతున్న వాళ్లకు.. అంతకు మించి గౌరవం ఇచ్చే మీడియాకు.., తిరుపతి రెడ్డి లాంటి వాళ్లను తప్పు పట్టే అధికారం ఉంటుందా..?

పోలీస్ వ్యవస్థలో తిరుపతిరెడ్డి ఒక్కడేనా అవినీతి పరుడు..!

మీరు పర్సు పోగొట్టుకుని… ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. మీకు కావాల్సింది ఎఫ్ఐఆర్ మాత్రమే. ఎందుకంటే… ఆ ఎఫ్ఆర్ కాపీ చూపిస్తే.. పర్సుతో పాటు పోగొట్టుకున్న కొన్ని ప్రభుత్వ కార్డులను నకలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సు ఎలాగూ పోలీసులు రికవరీ చేయరు. అది అసాధ్యం. ఆ ఎఫ్ఐఆర్ కోసం.. కనీసం.. ఐదు వేలు వదిలించుకోవాల్సిందే. స్టేషన్ లో ప్రతీ విభాగానికి.. ఎంతో కొంత.. సదరు బాధితుడు ఇవ్వాల్సిందే. ఇది.. ఏపీ.. తెలంగాణ అనే సంబంధం లేకుండా.. ప్రతీ స్టేషన్‌లో జరిగే తంతు. ఇది కింది స్థాయిది… ఇక పైస్థాయికి పోతూ ఉంటే… పోలీస్ స్టేషన్ అనేది.. ఓ కలెక్షన్ సెంటర్ మాత్రమే. ఈ విషయం అనుభవం కావాలంటే.. స్టేషన్లకు వెళ్లి ఉండాలి… కానీ.. రెండు రోజుల నుంచి ఒక్క తిరుపతి రెడ్డి గురించే.. పదే పదే… మీడియా ప్రచారం చేస్తోంది. కానీ మూలాల్లోకి పోవడం లేదు., ఒక్క తిరుపతి రెడ్డి మాత్రమే.. లంచగొండి అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అసలు తిరుపతిరెడ్డికి ఆ అవార్డు రావడానికి పై అధికారులు ఇంకెంత లంచం తీసుకుని సిఫార్సు చేశారు..? పై అధికారుల కోసం తిరుపతి రెడ్డి.. ఎంత స్థాయిలో కలెక్షన్లు చేశారు..? ఇలాంటివి తవ్వితే.. ఎక్కడో విషయం బయటపడుతుంది. కానీ ఘనత వహించిన మీడియా.. దొరికాడు కాబట్టి… తిరుపతిరెడ్డి దగ్గరే ఆగిపోతోంది.

వందలు, వేల కోట్లు దోచే పొలిటిషియన్ల సంగతేంటి..?

రాజకీయ నాయకులు దోచే సంపద … కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో ఓ పదవి పొందిన తర్వాత.. అపర కుబేరులైన వారు.. మన కళ్ల ముందే ఉన్నారు. వారినే మీడియా.. అహో భోజా అన్నంతగా పొగిడి… తలాపాపం.. తిలా పిడికెడు పంచుకునే ప్రయత్నం చేస్తోంది కానీ… అలాంటి నేతలను .., ఆదర్శంగా మారుస్తున్నామన్న విషయాన్ని తెలిసి కూడా… గుర్తించనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నేతలు.. చేసే దందాలు.. వారు చేసే అవినీతి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ.. ఏ ఒక్క మీడియా కూడా.. దీన్ని..దొంగ తనంగా చెప్పాదు. అవినీతిగా వివరించడానికి సాహసించదు. లోపం ఎక్కడుంది..?

ఎవరిదైనా అవినీతే..! బహిష్కరించే పరిస్థితి రావాల్సిందే..!

అవినీతి చేసే రాజకీయ నాయకులు అందలాలు ఎక్కుతున్నారు. వారిని చూసి.. స్ఫూర్తి పొందే.. వారు… తాము చేసేది తప్పేం కాదన్నట్లుగా చెలరేగిపోతున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అయినా.. మరొకరు అయినా… అవినీతికి పాల్పడి .. దొరికిపోయి.. అంత దీమాగా ఉంటున్నారంటే… తమ అవినీతికి… ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిందనే ఫీలింగ్ కు క్రమంగా వస్తున్నారనే అర్థం. దొరికిన దొంగలనైనా క్రమంగా శిక్షంచే పద్దతి దూరమవుతోంది. వారు సమాజంలో మరింత గౌరవం పొందే పరిస్థితులు వస్తున్నాయి. అందుకే… అవినీతి విచ్చలవిడిగా మారిపోతోంది. దీన్ని నిర్మూలించాలంటే.. వ్యవస్థలోనే మార్పు రావాలి. అందులో మీడియా కూడా కీలక పాత్ర పోషించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close