చిరు కోసం కొర‌టాల క‌థ మార్చాడా?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈపాటికే సినిమా షూటింగ్ మొద‌ల‌వ్వాల్సింది. కానీ.. `సైరా` బిజీ వ‌ల్ల కాస్త ఆల‌స్య‌మైంది. అయితే.. ఈ గ్యాప్‌లో క‌థ‌లో భారీ స్థాయిలో మార్పులు, చేర్పులూ జ‌రిగాయ‌ని తెలుస్తోంది. `సైరా` సెట్స్‌పై ఉండ‌గానే చిరుకి క‌థ వినిపించి ఓకే చేయించుకున్నాడు కొర‌టాల‌. క‌థ విష‌యంలో చిరుకి ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే.. ఇటీవ‌ల చిరు – కొర‌టాల మ‌ధ్య మ‌రో భేటీ జ‌రిగింది. అందులో క‌థ‌లో మార్పులు అవ‌స‌ర‌మ‌ని చిరంజీవి భావించ‌డం, దానికి కొర‌టాల కూడా అంగీక‌రించ‌డం జ‌రిగాయ‌ని స‌మాచారం. రైతు నేప‌థ్యంలో రాసుకున్న క‌థ‌ని… ఇప్పుడు పూర్తిగా మార్చార‌ని తెలుస్తోంది. ఖైది నెం 150, మ‌హ‌ర్షిలాంటి సినిమాలు రైతుల గురించి తీసిన‌వే. మ‌ళ్లీ అదే పాయింట్‌తో సినిమా తెర‌కెక్కించ‌డం క‌రెక్ట్ కాద‌ని చిరు భావించాడ‌ట‌. కొర‌టాల కూడా వెంట‌నే.. అందుకు త‌గిన మార్పులు, చేర్పుల‌తో సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. చిరు ప్ర‌స్తుతం క‌త్త‌ర్‌లో ఉన్నారు. తిరిగొచ్చాక పుట్టిన రోజు వేడుల‌తో బిజీ అవుతారు. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర‌వాత‌.. చిరు – కొర‌టాల మ‌ధ్య మ‌రో మీటింగ్ ఉంటుంది. ఈ రోజున కొర‌టాల చిరంజీవికి ఫైన‌ల్ వెర్ష‌న్ వినిపించ‌నున్నాడు. ఫైన‌ల్ వెర్ష‌న్ విన్న త‌ర‌వాతే.. మిగిలిన తారాగ‌ణం, ఇత‌ర సాంకేతిక నిపుణుల విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com