‘సాహో’ ప్రీ రిలీజ్‌లో హైలెట్ ఇదేనా?

ఓ పెద్ద సినిమా వ‌స్తోందంటే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించ‌డం మామూలే. ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించి, ఆ సినిమాలోని పాట‌ల‌కు డాన్సులు చేసి, మెడ్లీలు క‌ట్టి, స్పీచులు దంచి కొట్టి – మా సినిమా చూడండి మ‌హా ప్ర‌భో అంటూ వేడుకునే త‌తంగం అంతా ప్రీ రిలీజ్‌లోనే క‌నిపిస్తుంది.

అయితే సాహో ప్రీ రిలీజ్ మాత్రం వెరైటీగా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పాట‌లు, డాన్సులు, మెడ్లీలూ, స్పీచులూ ఇవ‌న్నీ కామ‌నే అనుకోండి. కానీ `సాహో వ‌రల్డ్` దానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. సాహో సినిమాలోయాక్ష‌న్ సీన్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో రేసు కార్లు, ఖ‌రీదైన స్పోర్ట్స్ బైకులు, ట్ర‌క్కులు, మిష‌న్ గ‌న్లు చాలా వాడారు. వాట‌న్నింటినీ సాహో ప్రీ రిలీజ్‌వేడుక‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్ర‌త్యేక‌మైన కారు త‌యారు చేయించారు. దాని విలువ 5 కోట్లు. ఆ కారు కూడా ఈ ఫంక్ష‌న్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌బోతున్నారు. రాజ‌మౌళి, దిల్‌రాజు, అల్లు అర‌వింద్‌, కృష్ణంరాజు త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com