ఆర్కే పలుకు : రాజాఇళాంగో లాంటి జడ్జిలయితే జగన్‌కు ఓకేనా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం.. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు పార్లమెంట్ వంటి వేదికలపైల నుంచి న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి గురించి విశ్లేషించారు. మిగతా అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కానీ కొత్తగా.. ఓ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. అదే గతంలో హైకోర్టు జడ్జిగా జగన్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాజా ఇళాంగో ప్రస్తుతం.. జగన్ అధికారంలోకి రాగానే ఓ ప్రభుత్వ పదవిని పొంది.. జీతభత్యాలు పొందుతూండటం. వ్యతిరేక తీర్పులు ఇస్తున్నారని అందరు న్యాయమూర్తులపై బురదచల్లేస్తున్న జగన్ అండ్.. ఈ మాజీ న్యాయమూర్తికి పదవి ఎందుకు కట్టబెట్టిందో.. దాని వెనుక ఏం జరిగిందో.. ఆర్కే పరోక్షంగా అయినా సంపూర్ణంగా విశ్లేషించారు.

న్యాయమూర్తిగా జస్టిస్ రాజా ఇళాంగో ఇచ్చిన తీర్పులన్నింటినీ ఆర్కే విశ్లేషించారు. అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తుచేసినప్పుడు .. రాజా ఇళంగో స్టే విధించారు. విజయసాయిరెడ్డి బంధువర్గానికి చెందిన హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు. అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్ రాజా ఇళంగోనేనని ఆర్కే గుర్తు చేశారు. అన్ని రకాలుగా.. జగన్ కేసుల్లో ఆయన నుంచి సానుకూల తీర్పులు వచ్చాయి. ఇప్పుడు ఆయన రిటైరయ్యాడు. జగన్ అధికారంలోకి రాగానే ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్‌గా పదవి పొందారు.

ఇంత చెప్పిన ఆర్కే… జస్టిస్ రాజా ఇళాంగో తీరును ఒక్కరంటే.. ఒక్కరు కూడా ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఆయన పదవి పొందినప్పుడు కూడా విమర్శలు చేయలేదని… ఆయన తీర్పులకు ప్రతిఫలంగా పదవి పొందారని విమర్శలు చేయడానికి అవకాశం ఉన్నా.. నిగ్రహం పాటించాలని .. న్యాయవ్యవస్థలకు ఇతరులకు ఇస్తున్న గౌరవం అలాంటిదని.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అందుకు భిన్నంగా తనకు వ్యతిరేక తీర్పులిస్తే.. అందరి సంగతి చూస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. రాజా ఇళంగోను అప్పట్లో మేనేజ్ చేశారనీ, ప్రతిఫలంగానే ఇప్పుడు పదవి ఇచ్చారనీ ఒక్కరైనా తప్పుబట్టకపోవడాన్ని ప్రజలు గమనించాలని నర్మగర్భంగా ఆర్కే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీయడం ఖాయమని చెప్పుకోవచ్చు.

ఈ వ్యవహారంలో ఆర్కే చాలా అంశాలను స్పృశించారు. టీడీపీ నాయకులు కేసులు ఎదుర్కోవడానికి భయపడుతున్నారని బేల తనాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ భూములు ఉండటమే నేరంగా పరిగణించి.. ముందు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు.. టీడీపీ నేతలపై ఏసీబీ కేసులు పెడుతుందని కూడా.. విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తప్పుడు కేసుల నుంచి న్యాయస్థానాలు కూడా టీడీపీ నేతల్ని కాపాడకుండా.. చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌కు న్యాయవ్యవస్థ తలొగ్గకుండా స్వతంత్రంగా పని చేయగలుగుతుందా అనేది ఆర్కే సందేహం. ఈ బ్లాక్‌మెయిలింగ్ ఎక్కడి వరకు వెళ్తుందనేది.. ఆర్కే కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి జస్టిస్ రాజాఇళాంగో తీర్పులపై ప్రస్తుతం ఆర్కే చర్చ లేవనెత్తారు. గతంలో న్యాయమూర్తులకే లంచాలు ఇవ్వడానికి గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్లు దొరికిపోయారు. ఆ సందర్భాలు ఆర్కే ప్రస్తావించలేదు కానీ.. అవన్నీ .. ఇప్పుడు చర్చల్లోకి రావాల్సిన అంశాలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close