గ్రేటర్‌లో సెంచరీపై కేటీఆర్ గురి..!

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయం సాధించి పెట్టి.. నేరుగా సచివాలయానికి దారి చేసుకోవాలని కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు. 2016గ్రేటర్ ఎన్నికల్లో 150డివిజన్లకు గాను 99స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. అది భారీ విజయం. ఈ సారి అంతకన్నా భారీ విజయం నమోదు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. వంద స్థానాలను గెలవాలని మంత్రి కేటీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు… శంకుస్థాపనలతో హడావుడిగా గడుపుతున్నారు.

2016జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్ కే అప్పగించారు. తండ్రి అప్పజెప్పిన బాధ్యతను సవాల్ గా తీసుకున్న కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నుంచి అన్నీ తానై వ్యవహరించారు. పరిస్థితులకు ఎదురీది 99స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ కు.. మున్సిపల్ శాఖను కూడా కేసీఆర్ బోనస్ గా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.

కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, ఫ్లై ఓవర్లు, రోడ్లు, ఫుట్ ఫాత్ లు, పార్కులు, జిమ్ ల ప్రారంభాలకు హాజరవుతూ.. బస్తీల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొస్తున్నారు‌. మరోవైపు గ్రేటర్ లో ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో గతవారం హోంమంత్రి మహమూద్ అలీతో సమావేశమై ముస్లిం ఓట్ బ్యాంక్ పై చర్చించారు. తాజాగా పాస్టర్లు, బిషప్స్ తో సమావేశమైన కేటీఆర్.. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. త్వరలో క్రిస్టియన్ భవన్, గ్రేవ్ యార్డ్ పనులు ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బస్తీల్లో పరుగులు పెట్టిస్తున్నారు. 100 స్థానాలకుపైగా గెల్చుకుంటే… మిత్రపక్షం ఎంఐఎంకు మరో 30 స్థానాలొస్తాయి. దీంతో బల్దియాలో విపక్షాలకు చోటు ఉండదని నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాళ్ల పేర్లు చెప్పి మోసం చేసేవాళ్లు ఎక్కువై పోయారు..!

వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారికి విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. వారి పేర్లతో వేరే ఎవరో దందాలు చేస్తున్నారు. విషయం తెలిసే సరికి కొంత మంది మోసపోతున్నారు. చివరికి వారు తమకేం...

ఏపీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఖర్చైపోతారు..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కాలంటే.. ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. లేకపోతే..బండి ఖరీదు కన్నా ఎక్కువ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అనూహ్యంగా... రవాణా శాఖ ... జరిమానాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది....

నరసింహన్ మర్చిపోలేదు..! పాతికవేల విరాళం పంపారు..!

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా.. ఆ తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా.. ఆ తర్వాత తెంలగాణ గవర్నర్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన నరసింహన్‌.. పదవీ కాలం పూర్తయిన తర్వాత తమిళనాడులో స్థిరపడ్డారు....

నిమ్మగడ్డ పిటిషన్.. ఏపీ సర్కార్ పరేషాన్..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి రోజువారీ ఖర్చులకు కూడా నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నిధులను ఏపీ సర్కార్ నిలిపివేయడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పిటిషన్ వేయగానే అలా...

HOT NEWS

[X] Close
[X] Close