జగన్ డిక్లరేషన్ అంశాన్ని వివాదాస్పదం చేసిన వైవీ సుబ్బారెడ్డి..!

తిరుమల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలన్న విషయంలో టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలతో.. వివాదాస్పదం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వెళ్లినా… ముఖ్యమంత్రిహోదాలో వెళ్లినా ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. అయినా టీటీడీ చైర్మన్ ఈ అంశంపై అతిగా స్పందించారు. ఎవరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో ఒక్క సారిగా వివాదం పార్లమెంట్‌కు చేరిపోయింది. హిందూ ఆలయాల పవిత్రతను దెబ్బతీస్తున్నారని.. హిందూత్వ సంస్థల తీవ్ర స్థాయిలో విరుచుకుపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అన్యమతస్థులు.. తమకు శ్రీవారిపై సంపూర్ణ విశ్వాసం ఉందని.. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనం చేసుకోవాలని టీటీడీ చట్టంలో స్పష్టంగా ఉంది. అందుకే.. భక్తుల్లోనూ.. టీటీడీ చైర్మన్ తీరుపై చర్చలు ప్రారంభమయ్యాయి.

బయట ఆలయాలపై దాడులు జరుగుతూంటే… తిరుమల విషయంలో సంప్రదాయాలు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ.. భక్తుల మనోబావాలపై దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అనుమానించడం ప్రారంభించారు. చట్టం గురించి ముందు వైవీ సుబ్బారెడ్డికి తెలుసో తెలియదో కానీ… అంతా వివాదాస్పదం అయిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. అన్యమతమస్థులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉందని.. జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వరని చెప్పుకొచ్చారు. ఇలా చెప్పడం వల్ల.. ” ఏం.. జగన్ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా..?” అన్న విమర్శలు రావడానికి కారణం అయ్యారు. చట్టంలో ఉన్నప్పుడు అన్యమతస్థుడైన జగన్ ఎందుకు డిక్లకేషన్ ఇవ్వరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గతంలో అబ్దుల్ కలాం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. చట్టం గురించి తనకు శ్రీవారిపై నమ్మకం ఉందని ఆయన డిక్లరేషన్ ఇచ్చిన అంశాన్ని భక్తులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాంకన్నా.. జగన్ పదవి గొప్పా అని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా ఉండి.. టీటీడీ చట్టాలను ఉల్లంఘిస్తారని.. దానికి తాము అనుమతిస్తామన్నట్లుగా వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడం…వివాదం కోసమేనని అంటున్నారు. ఓ పద్దతి ప్రకారం హిందూత్వంపై జరుగుతున్న దాడిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయం హిందూ సంఘాల్లో ఏర్పడుతోంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే వివాదం లేవనెత్తారని.. శ్రీవారిపై ఏ మాత్రం విశ్వాసం లేని క్రిస్టియన్ .. పట్టువస్త్రాలు సమర్పిస్తున్నాడనే భావనను పంపడానికి ప్రయత్నిస్తున్నారని.. హిందూ సంఘాలు అనుమానిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం మాత్రం ఫ్యాబ్రికేటెట్ అని..దానికి వైవీ సుబ్బారెడ్డి కావాలని బీజం వేశారని నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close