మెడికల్ కాలేజీల విషయంలో హోంమంత్రి అనిత శుక్రవారం ప్రెస్మీట్ పెట్టారు. కాలేజీల దుస్థితిని.. వీడియోల సాక్ష్యంగా బయట పెట్టారు. జగన్ రెడ్డికి చాలెంజ్ చేశారు దమ్ముంటే.. మెడికల్ కాలేజీలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తీసుకెళ్తాం రావాలని సవాల్ చేశారు. అనిత ప్రెస్మీట్ వైరల్ అయింది. తాము పదిహేడు కాలేజీలు కట్టామని.. అటు నుంచి వెళ్తున్న వారు ఆగి..చూసి.. ఆహా అంటారని జగన్ ప్రెస్మీట్లో చేసి చూపించి స్కిట్ ను గుర్తు చేస్తూ.. కాలేజీలు చూసేందుకు జగన్ వెళ్లాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అనిత ప్రెస్ మీట్ సెగ వైసీపీకి బాగా తగిలింది. వెంటనే రోజాను రంగలోకి దింపారు. ఆమె .. విస్తరాకుల కట్ట భాషతో తన టాలెంట్ చూపించారు. అనితకు అబద్దాలు చెప్పడంతో ట్రైనింగ్ ఇస్తున్నారని.. అనిత చూపించిన వీడియోలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చారు. మరి నిజం ఏమిటో వైసీపీ నేతలు వీడియోల రూపంలో బయట పెట్టవచ్చు. పునాదులు వేసి వదిలేసి.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని మళ్లించేసిన దౌర్భాగ్యపు పని చేయడమే కాకుండా ఇప్పుడు.. తాము కట్టేశామని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేసుకుంటున్నారు.
రోజా ప్రెస్ మీట్లో నాలుగు మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి వాటిని చూసేందుకు రావాలని సవాల్ చేశారు. అవన్నీ.. గతంలోనే మంజూరు అయి నిర్మాణాలు జరిగినవి.. జగన్ రెడ్డి తాను శంకుస్థాపన చేసిన వాటిలో ఒక్క పులివెందుల తప్ప.. ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు. పులివెందులలోనూ భవనాలు తప్ప మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అయినా.. నిజాలు చెబితే మాత్రం.. రోజా లాంటి వాళ్లు.. బూతులతో విరుచుకుపడేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.