రూ.600 కోట్లా…?? న‌మ్మాలా.. ర‌జ‌నీ…?

‘రోబో 2.ఓ’ బ‌డ్జెట్ ఎంత‌?
– యేడాది క్రితం వ‌ర‌కూ ఈ సినిమా బ‌డ్జెట్ రూ.200 కోట్లే. చిత్ర‌బృందం కూడా ఇదే మాట చెబుతూ వ‌చ్చింది.
ఆ త‌ర‌వాత రూ.300 కోట్ల‌న్నారు..
రూ.400 కోట్ల‌న్నారు..
ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్లు అంటున్నారు.
స్వ‌యంగా ర‌జ‌నీకాంతే… ‘ఆరొంద‌ల కోట్ల‌తో సినిమాపూర్తి చేశాం’ అని స‌భాముఖంగా ప్ర‌క‌టించేశాడు కూడా. అంటే.. అనుకున్న బ‌డ్జెట్‌కి మూడొంతులు ఖ‌ర్చ‌య్యింన్న‌మాట‌. శంక‌ర్ సినిమా క‌దా, భారీగా ఖ‌ర్చు పెట్ట‌డం స‌హ‌జ‌మే. అయితే మ‌రీ ఆరొంద‌ల కోట్లంటే న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు. ట్రైల‌ర్ చూసినా అదే అనుమానం. సినిమాలో దాదాపు 80 శాతం బ్లూ మేట్‌లో తీసుంటారు. దానికి సంబంధించి విజువ‌ల్ ఎఫెక్ట్స్ అవ‌స‌రం అయ్యుంటాయి. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌లు మిన‌హాయిస్తే.. స్టార్లెవ‌రూ ఈ సినిమాలో లేరు. పారితోషికాల లెక్క రూ.150 కోట్లు అనుకుందాం. అంటే రూ.450 కోట్లు మేకింగ్‌కి అయ్యిందా? ఇది కేవ‌లం గాలి లెక్క‌లేనా?? నిజంగానే ఇంత ఖ‌ర్చు పెట్టారా?

నిజంగా ఈ సినిమాకి రూ.600 కోట్ల‌య్యాయంటే అది అద్భుత‌మే అనుకోవాలి. భార‌తీయ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో రికార్డుగా అభివ‌ర్ణించాలి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ, సెట్స్‌కీ, భారీ తారాగణానికి పెద్ద పీట వేసిన `బాహుబ‌లి` రెండు చిత్రాల‌కు క‌లిపే రూ.600 కోట్ల బ‌డ్జెట్ అవ్వ‌లేదు. అలాంటిది రోబో 2.ఓకి అంత ఖ‌ర్చు పెట్టాల్సిన అస‌వ‌రం ఏముంది? సినిమా మొత్తం విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో తీసినా ఆ స్థాయి ఖ‌ర్చు అవ్వ‌దు. కేవ‌లం డిలే వల్ల ఈ స్థాయిలో ఖ‌ర్చు పెరిగిందా? లేదంటేనే నిజంగానే తెర‌పై శంక‌ర్ ఓ అద్భుతాన్ని ఆవిష్క‌రిస్తున్నాడా?? అన్నీ కాదంటే – కేవ‌లం హైప్ కోస‌మే ఈ స్థాయిలో అంకెలు చెప్పేస్తున్నారా? అనేది కొత్త చర్చ‌కు దారి తీసింది. రోబో సంగ‌తికి వ‌ద్దాం. దాదాపు రూ.150 కోట్ల‌తో ఈ సినిమా పూర్త‌య్యింది. సినిమా మొత్తం గ్రాఫిక్సేం ఉండ‌వు. మూమూలు కమ‌ర్షియ‌ల్ పంథాలో సాగుతూనే అక్క‌డ‌క్క‌డ విజువ‌ల్ ఎఫెక్ట్స్ చూపిస్తూ వెళ్లాడు శంక‌ర్‌. సినిమా మొత్త‌మ్మీద దాదాపు 45 నిమిషాలు గ్రాఫిక్స్ అవ‌స‌ర‌మ‌య్యాయేమో. `రోబో 2.ఓ`కీ శంక‌ర్ అదే పంథాలో వెళ్లి ఉంటాడు. అందులో అనుమానాలేం అవ‌స‌రం లేదు. పైగా ఈమధ్య విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా చ‌వ‌కైపోతోంది. అంత‌ర్జాతీయ సంస్థ‌లు రంగంలోకి దిగి త‌క్కువ ఖ‌ర్చుతో కావ‌ల్సిన నాణ్య‌త‌తో గ్రాఫిక్స్ డిజైన్ చేస్తున్నారు. అలా చూసినా. ఆరొంద‌ల కోట్లు కేవ‌లం నోటి మాట‌గానే వినిపిస్తోంది. శంక‌ర్ ఆరొంద‌ల‌ కోట్ల సినిమా తీశాడంటే.. ద‌క్షిణాదివాళ్లుగా మ‌నం గ‌ర్వ‌ప‌డాల్సిందే. కానీ… అది నోటిమాట కాక‌పోతే బాగుంటుంద‌న్న‌ది అంద‌రి ఆశ‌. మ‌రి శంక‌ర్ ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close