ర‌జ‌నీ ఆరోగ్యం ఆస్థాయిలో దెబ్బ‌తిందా..??

‘రోబో 2.ఓ’ సినిమా సెట్స్‌లోనే చాలా ఏళ్లు ఉండిపోయింది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాల‌తో వ‌చ్చే చిక్కే ఇది. గ్రాఫిక్స్ ప‌నులు ఏ ప‌ట్టాన తెవ‌ల‌వు. అందుకే ఈ స్థాయిలో ఆల‌స్యం జ‌రిగి ఉండొచ్చ‌నుకున్నారు. పైగా శంక‌ర్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ టైపు. ఏదీ అంత తేలిగ్గా న‌చ్చ‌దు. అందుకే తీసిన సీనే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తుంటాడు. దానికి తోడు త్రీడీ సినిమా కాబ‌ట్టి అది మ‌రింత ఆల‌స్యం అవుతుంది. కాక‌పోతే… రోబో 2.ఓ ఆల‌స్యానికి మ‌రో బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. అదే.. ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం.

రోబో 2.ఓ మొద‌లైన కొన్ని రోజుల‌కే ర‌జ‌నీ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యులు క‌నీసం ఆరు నెల‌లు విశ్రాంతి తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఓద‌శ‌లో ర‌జ‌నీకాంత్ ‘నేను షూటింగ్ చేయ‌లేను. ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటాను. కావాలంటే… ఇప్ప‌టి వ‌ర‌కూ అయిన ఖ‌ర్చు వెన‌క్కి ఇచ్చేస్తా’ అని చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని ఈరోజు చెన్నైలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ర‌జ‌నీనే చెప్పారు. ఈ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ఆ స్థాయిలో ర‌జ‌నీ ఆరోగ్యం చెడిపోయిందా?? అనే అనుమానాలు వ‌స్తున్నాయి. నిజంగానే ఆమ‌ధ్య ర‌జ‌నీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. చికిత్స నిమిత్తం విదేశాల‌కు కూడా వెళ్లారు. ఆ ద‌శ‌లో ర‌జ‌నీ ఆరోగ్యంపై చాలా పుకార్లు వ‌చ్చాయి. వాట‌న్నింటినీ తోసి పుచ్చుతూ ర‌జ‌నీ కుటుంబ స‌భ్యులు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు స‌మాచారం అందిస్తూ వ‌చ్చారు. కానీ.. ఇప్పుడు ర‌జ‌నీ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే… నిజంగానే ర‌జ‌నీ ఆరోగ్యం ఆ రోజుల్లో .. బాగా క్షీణించింద‌ని అర్థం అవుతోంది.

ఓ ద‌శ‌లో శంక‌ర్ కూడా క‌ల‌గ చేసుకుని.. ‘ఈ సినిమాని తాత్కాలికంగా ఆపేద్దాం… మీరు సంపూర్ణంగా కోలుకున్న త‌ర‌వాతే మొద‌లెడ‌దాం’ అని చెప్పార‌ని, కానీ ర‌జ‌నీనే మళ్లీ ధైర్యం తెచ్చుకుని షూటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలుస్తోంది. శంక‌ర్ కూడా చూచాయిగా ఇదే విష‌యం చెప్పుకొచ్చాడు. ‘మీరు సెట్‌కి రండి. మీ మొహం చూపించండి చాలు. మిగిలిన‌ది నేను చూసుకుంటా’ అని శంక‌ర్ హామీ ఇచ్చాడ‌ట‌. ఇది విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్య‌త ఇచ్చిన సినిమా. చాలా విష‌యాలు బ్లూ మేట్‌లోనే జ‌రిగిపోతుంటాయి. న‌టీన‌టుల‌కు సంబంధించిన స్కెచ్చులు ఉంటే చాలు. దాంతో.. గార‌డీలు చేసేయొచ్చు. బ‌హుశా.. శంక‌ర్ కూడా ఈ సినిమాలో అదే చేశాడేమో.

మొత్తానికి ర‌జ‌నీ ఆరోగ్యం కుదుట ప‌డింది. రోబో 2. ఓని దిగ్విజ‌యంగా పూర్తి చేశాడు. ఇక ఆ వినోదాల్ని వెండి తెర‌పై ఆస్వాదించ‌డ‌మే త‌రువాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close