ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ కు ఊరట లభించింది. చివరి వన్డేలో ఆసీస్‌పై 9 వికెట్లతో ఓడించింది. సిరీస్ కోల్పోయినా… గెలపుతోఈ పోరుకు ముగింపు పలకడం శుభసూచికమే. మరీ ముఖ్యంగా సీరియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (121 నాటౌట్), కోహ్లీ (74 నాటౌట్) విజృంభించారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈసారి సాధికారికమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వన్డేలో అర్థ సెంచరీతో ఆకట్టుకొన్న రోహిత్.. ఈసారి సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి ఫామ్ పై ఉన్న అనుమానాల్ని ఇద్దరూ ఒకేసారి పటాపంచలు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ (41), రాన్షా (51) మాత్రమే రాణించారు. ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్ ఆ తరవాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణించాడు. వాష్టింటన్ సుందర్‌కి 2 వికెట్లు దక్కాయి. వచ్చే వారం ఆసీస్ తో టీ 20 సిరీస్ మొదలు కానుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయినా, చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం టీ 20 సిరీస్ కు ముందు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.