రోజా.. ఐరెన్ లెగ్ ముద్ర పోయిన‌ట్టే!

సినిమాల్లోగానీ, రాజ‌కీయాల్లోగానీ ఓ ముద్ర ప‌డిపోతే.. దాన్ని చెరుపుకోలేం. రోజాపై కూడా అలాంటి ముద్ర ఒక‌టి ఉంది. ఐరెన్ లెగ్ అని. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అప్పుడ‌ప్పుడు ఛ‌లోక్తులు విసురుకుంటుంటారు. రోజా కాంగ్రెస్‌లో చేరాక వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి హైలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. వైకాపాలో చేరిన‌ప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. అప్ప‌టి నుంచీ రోజాపై ఐరెన్ లెగ్ ముద్ర అలానే ఉంది. ఇప్పుడు న‌గ‌రి నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైంది రోజా. త‌న పార్టీ కూడా అధికారంలోకి వ‌చ్చేసింది. ఈ సారి రోజాకి మంత్రి ప‌ద‌వి ఖాయం అంటూ ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి రాజ‌కీయాల్లోనూ రోజాకి మంచి రోజులు వ‌చ్చేసిన‌ట్టే. అన్నింటికంటే ముఖ్యంగా ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయిన‌ట్టే. ఈ ఎన్నిక‌ల్లోనూ రోజా గెలిచి, వైకాపా రాక‌పోతే మాత్రం.. రోజా ఎప్ప‌టికీ `ఐరెన్‌లెగ్`గానే మిగిలిపోదును. ఆ అప‌ప్ర‌ద ఇప్పుడు పూర్తిగా తొల‌గిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close