పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే ఓ సినిమా చేసిన అనుభ‌వం ఉంది. నిర్మ‌లా కాన్వెంట్ తో తెరంగేట్రం చేసేశాడు. అయితే… రోష‌న్‌కి న‌ట‌న విష‌యంలో మ‌రిన్ని మెళ‌కువ‌లు అవ‌స‌రం అనుకున్నారో ఏమో… కొన్ని ప్ర‌త్యేక క్లాసులు తీసుకుంటున్నారు.

హైద‌రాబాద్ లో రాఘ‌వేంద్ర‌రావుకి ఓ మ‌ల్టీప్లెక్స్ ఉంది. అదే.. సినీ మాక్స్‌. ఇప్పుడు పీవీఆర్ చేతికి వెళ్లిపోయింది. అందులోనే ఈ సినిమాకి సంబంధించిన ఆఫీసు కూడా వుంది. ఇప్పుడు అక్క‌డే రోష‌న్‌కి యాక్టింగ్ క్లాసులు మొద‌లయ్యాయి. `పెళ్లి సంద‌డి` వ‌ర్క్ షాప్ లా.. కొన్ని ట్రైనింగ్ సెష‌న్స్ ని నిర్వ‌హిస్తున్నారు. దాంతో పాటు హీరోయిన్ల ఆడిష‌న్లూ ఇక్క‌డే జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్సుంది. హీరోయిన్లుగా కొత్త‌వాళ్ల‌కే అవ‌కాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మ‌రో వారంలో హీరోయిన్ల‌ని ఫైన‌లైజ్ చేయ‌నున్నారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ట్యూన్లు సిద్ధం చేసిన‌ట్టు టాక్‌. `పెళ్లి సంద‌డి`లో పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్ట‌య్యాయి. దానికి ఏమాత్రం త‌గ్గ‌ని ఆల్బ‌మ్ రాబోతోంద‌ని స‌మాచార‌మ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close