శ్రీ‌దేవి జ‌పం చేస్తున్న సుధీర్ బాబు

ప‌లాస‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం మొద‌లెట్టేశారు. గోలీసోడాలు చూపించి… `ఇవి మీకు గుర్తున్నాయా..` అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గోలీసోడాని చూపిస్తున్నారంటే ఇది 1980 నాటి క‌థే. ఈ క‌థ‌కూ సోడాకూ లింకుంది కూడా.

అన్న‌ట్టు ఈ సినిమాకి `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌` అనే పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. ఈరోజు సాయింత్రం 4 గంట‌ల‌కు.. మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర‌బృందం. టైటిల్ కూడా బ‌య‌ట‌పెడుతుందేమో చూడాలి. శ్రీ‌దేవిగా ఎవ‌రు క‌నిపిస్తార‌న్న‌దీ ఆస‌క్తిక‌ర‌మే. `ప‌లాస‌` కూడా రెట్రో క‌థే. ఆనాటి వాతావ‌ర‌ణాన్ని క‌రుణ కుమార్ బాగానే ఆవిష్క‌రించాడు. ఈసారీ అదే జోన‌ర్‌లో సినిమా తీస్తున్నాడు. కాక‌పోతే.. ఇది ప‌లాస టైపులో భావోద్వేగ‌భ‌రిత‌మైన క‌థ కాద‌ట‌. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

కోహ్లీ… ఇదేం కెప్టెన్సీ??

ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల‌లో కోహ్లీ ఒక‌డు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ లేవు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌న్నీ బ‌ద్దలు కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌ది క్రికెట్ అభిమానుల...

రైతులకు పరిహారంపై జగన్ ఔదార్యం చూపలేకపోతున్నారా..!?

నివార్ తుపాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి భారీ నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. ఎకరానికి పంటను బట్టి పదిహేను నుంచి పాతిక వేల...

HOT NEWS

[X] Close
[X] Close