‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకొన్న జంట… రోషన్, శ్రీదేవి. వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. అదే ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. రోషన్, శ్రీదేవి జంట చూడముచ్చటగా ఉంది. వాళ్ల డైలాగుల్లో తెలంగాణ యాస బాగా పలికింది. టైటిల్ ని బట్టి ఈ చిత్రంలో సంగీతానిది ప్రధాన పాత్ర అని అర్థం అవుతోంది.
‘కోర్ట్’ తో పోలిస్తే రోషన్, శ్రీదేవిలకు విభిన్నమైన పాత్రలు లభించాయి. వాళ్ల కెమిస్ట్రీ, తెలంగాణ నేటివిటీ, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది `బేబీ`తో ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకొన్న విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు, అందులోనూ యూత్ ఫుల్ స్టోరీలకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. పాటలు బాగుండి, కాస్తో కూస్తో ప్రమోషన్లు చేసుకోగలిగితే.. అదే ప్లస్ పాయింట్. కోన వెంకట్ కు తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. `బ్యాండ్ మేళం`తో కూడా ఆయన తన సౌండ్ గట్టిగా వినిపించే ఛాన్సుంది.
