మిగిలిన సినిమాల్ని మ‌ళ్లీ క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన ఆర్‌.ఆర్‌.ఆర్‌

ఆర్‌.ఆర్‌.ఆర్ కొత్త రిలీజ్ డేట్లు వ‌చ్చేశాయి. మార్చి 18 లేదంటే… ఏప్రిల్ 28న ఈసినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇది ఊహించిన ప‌రిణామ‌మే. ఎందుకంటే ఏప్రిల్ 28న ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ముందే ఊహించాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ కి త‌గిన స్లాట్ అక్క‌డే ఉంది. రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్ రిలీజ్ డేట్ చెప్పేసి, చేతులు దులుపుకున్నాడు గానీ, ఇప్పుడు మిగిలిన సినిమాల‌న్నీ ఒత్తిడిలో ప‌డిపోయాయి. ముఖ్యంగా రాధేశ్యామ్‌.

టాలీవుడ్ లో తెర‌కెక్కిన రెండు భారీ చిత్రాలు ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికి వ‌ద్దామ‌నుకుని వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ వీలైనంత త్వ‌ర‌గా రావాలి. లేదంటే.. వ‌డ్డీల భారం మోయ‌లేక ఇబ్బంది ప‌డాల్సి వుంటుంది. అందుకే ముందుగా రాజ‌మౌళి రంగంలోకి దిగిపోయాడు. త‌న సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశాడు. ఒక డేట్ ఫిక్స‌యితే బాగానే ఉండేది. రెండు డేట్లు లాక్ చేసేశాడు. మ‌రి రాధే శ్యామ్ ఎప్పుడు రావాలి..? నిజానికి మార్చి 18న వ‌ద్దామ‌ని రాధే శ్యామ్ ప్లాన్ చేస్తోంది. ఈ విష‌యాన్ని డిస్టిబ్యూట‌ర్స్‌కీ చూచాయిగా చెప్పింది. స‌డ‌న్ గా ఆ డేట్ కూడా లాగేసుకుంది ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఇప్పుడు క‌చ్చితంగా మార్చి తొలి వారంలో లేదంటే.. ఏప్రిల్ ద్వితీయార్థంలో రాధే శ్యామ్ రావాలి. మార్చి 18న ఆర్‌.ఆర్‌.ఆర్ ఫిక్స‌యితే.. మార్చి తొలి వారంలో రాధేశ్యామ్ వ‌స్తుంది. లేదంటే.. ఏప్రిల్ రెండు, లేదా మూడో వారంలో రావాలి. ఆర్‌.ఆర్‌.ఆర్ కంటే ముందే త‌మ సినిమాని విడుద‌ల చేయాల‌ని రాధే శ్యామ్ భావిస్తోంది. కాబ‌ట్టి రిలీజ్ డేట్ల విష‌యంలో త్వ‌ర ప‌డాలి.

ఆర్‌.ఆర్‌.ఆర్ ప్ర‌భావం ఆచార్య‌పై కూడా ప‌డింది. మార్చి 18న ఆర్‌.ఆర్.ఆర్ వ‌స్తే ఏప్రిల్ 1న ఆచార్య రావొచ్చు. ఎందుకంటే.. ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌లైన త‌ర‌వాతే… ఆచార్య రావాల‌న్న‌ది ఓ ఒప్పందం. ఏప్రిల్ 28న వ‌స్తే మాత్రం.. క‌చ్చితంగా ఆచార్య‌ని మేలో విడుద‌ల చేసుకోవాలి. మార్చి 18, ఏప్రిల్ 28 మ‌ధ్య‌లో రావ‌ల్సిన సినిమాలు ఇప్పుడు త‌ప్ప‌కుండా స్ట్ర‌గుల్ అవ్వ‌బోతున్నాయి. ఈ రెండు డేట్ల‌లో ఆర్‌.ఆర్‌.ఆర్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేక‌పోవ‌డం వ‌ల్ల‌, మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు పూర్తిగా డిస్ట్ర‌బ్ అవ్వ‌బోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...
video

”థ్యాంక్ యూ” టీజర్.. చైతు ప్రయాణం

https://www.youtube.com/watch?v=t5NPiPtZ8PY నాగచైతన్య- విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. 'నా విజయానికి నేనొక్కడినే కారణం' అనే హీరో డైలాగ్ తో ఓపెన్ అయన టీజర్...

కోనసీమ చిచ్చుపై పవన్ ప్రశ్నలకు వైసీపీ దగ్గర జవాబుందా?

కోనసీమలో చిచ్చు పెట్టాడనికే వైసీపీ ప్రణాళికాబద్దంగా వ్యవహరించిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలా గొడవలు జరగడం.. అలా తమపై విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడటంతో పవన్ కల్యాణ్ అసలు విషయాలను ప్రజల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close