కేఏ పాల్ టిక్కెట్ రూ. 5 లక్షలు..! వద్దంటే ఫ్రీ…!

రాజకీయ పార్టీ పెట్టిన కేఏ పాల్.. రూ. ఐదు లక్షలకే టిక్కెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదీ కాకపోతే.. కనీసం ఉచితంగా అయినా తీసుకోమని బతిమాలుతున్నారు. పొరపాటున ఎవరైనా… ఎదురెళ్లి.. నేను మీ అభిమానినంటే… వెంటనే..”ఎవరక్కడ..” అని తన సిబ్బందిని పిలిచి…”గివ్ హిమ్ ఏ టిక్కెట్” అని ఆర్డర్ వేసేస్తున్నారు. దీంతో.. అలా పలకరించిన వాళ్లు షాక్‌గు గురవుతున్నారు. కేఏ పాల్… ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ.. ఎవరూ ముందుకు రాలేదు. దాంతో.. తెలిసిన వాళ్లకి, పాస్టర్లకి… టిక్కెట్లు ఇచ్చారు. ఇంకా మిగిలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఓ టెక్నిక్ ప్రవేశ పెట్టారు.

ఎవరైనా వచ్చి.. సార్ నేను మీ ఫ్యాన్‌ను అంటే.. వెంటనే… మెరిసేపోయే కళ్లతో చూస్తున్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన తర్వాత.. ఓ వ్యక్తి ఇలాగే “సార్..మేము మీ అభిమానులం…యూ ట్యూబ్ లో మీ వీడియోలు బాగా చూస్తాం…” అని రొటీన్‌గా ఓ మాట అన్నారు. వెంటనే.. పాల్ తన సిబ్బందిని టక్కున పిలిచారు. ఇతను నా అభిమాని అని చెప్పారు. వెంటనే ఇతని ఊరు, పేరు, వివరాలు కనుక్కుని ఏ ప్రాంతంలో టిక్కెట్ కావాలో అడిగి వెంటనే ఇచ్చేయండి అని చెప్పేశారు. అలాగేనంటూ సిబ్బంది తలూపారు. ఆ తరువాత సిబ్బంది మీడియా విభాగంలోని ఆ వ్యక్తి వద్దకు వచ్చి వివరాలు అడిగారు. పాపం ఆ వ్యక్తి భయపడి వెళ్లిపోయాడు.

కేఏ పాల్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకున్నారో కానీ… ఏపీలో మాత్రం చాలా కామెడీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న చేష్టలు చూసి.. చాలా మంది… నవ్వుకుంటున్నా.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడని.. జాలి పడుతున్నారు. కానీ కేఏ పాల్ మాత్రం.. తాను అప్పట్లో ఎలా ఉండేవాడినో.. ఇప్పుడూ అలానే ఉంటున్నానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి ఎన్నికలయ్యేలోపు… కేఏ పాల్ ఏం చేస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close