బీజేపీలో ఆరెస్సెస్ క్యాంప్ “ప్లాన్ బీ”..!

భారతీయ జనతా పార్టీలో కంట్రోలింగ్ ప్యానల్ ఎప్పుడూ ఆరెస్సెస్ బృందమే ఉంటుంది. మోడీ, అమిత్ షాలు అధికార కేంద్రాలుగా మారిన తర్వాత.. వారికి ఆరెస్సెస్‌తో దూరం పెరిగింది. అందుకే.. ఆ సమయంలోనే ఆరెర్సెస్ నుంచి.. ఇద్దరు ముఖ్యులు… బీజేపీలో అగ్ర స్థానానికి చేరుకున్నారు. వారే రామ్ మాధవ్, మురళీధర్ రావు. ప్రధాన కార్యదర్శులుగా వీరు.. పార్టీని కంట్రోల్ చేయడం ప్రారంభించారు. అమిత్ షా తర్వాత అధ్యక్షుడిగా రామ్‌మాధవ్ అవుతారనే ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అందుకే ఇప్పుడు వీరిద్దరూ.. ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

శత్రు పార్టీలను పొగిడేస్తున్న ఆ ఇద్దరు “ఆరెస్సెస్” ప్రముఖులు..!

కొద్ది రోజులుగా… బీజేపీలోని “ఆరెస్సెస్ కంట్రోల్” ప్యానల్‌గా పేరు పొందిన రామ్మాధవ్, మురళీధర్ రావు మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేస్తూ.. బీజేపీ వాదన వినిపిస్తూనే.. సొంత మెజార్టీ రాదని.. ఇన్ డైరక్ట్‌గా చెబుతున్నారు. కొత్త మిత్రులను ఆహ్వానిస్తామంమటున్నారు. వివిధ పార్టీలతో పెరిగిన శత్రుభావాన్ని తగ్గించుకునేందుకు.. మాటలు,చేతలు మార్చుకుంటున్నారు. చివరికి టీడీపీని కూడా దువ్వే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి.. మురళీధర్ రావు.. తమ పార్టీ విధానం ప్రకారం.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని మీడియాకు చెబుతున్నారు. కానీ ఆ తర్వాత…మళ్లీ టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని.. చంద్రబాబు కార్యదక్షుడని పొగిడేస్తున్నారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ.. చంద్రబాబుపై సానుకూలంగా మాట్లాడిన బీజేపీ నేత ఒక్కరు కూడా లేరు. తీవ్రంగా విమర్శలే వచ్చాయి. కానీ ఇప్పుడు మురళీధర్ రావు… గెలిచినా ఆశ్చర్యం లేదు..సమర్ధుడు అంటూ మాట్లాడుతూండటంతో… మారుతున్న స్ట్రాటజీకి నిదర్శనంగా కనిపిస్తోంది.

ఫలితంపై క్లారిటీకి వచ్చింది కాబట్టే ప్లాన్ బీ అమలు..!

ఒడిషాలో..తాము బాగా బలపడ్డామని బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అక్కడ ఉన్న 21 సీట్లు.. ఐదారు వచ్చినా గొప్పేనన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఈ సమయంలో.. బిజూ జనతాదళ్‌ను.. మచ్చిక చేసుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. మిస్టర్ క్లీన్‌గా పేరున్న నవీన్ పట్నాయక్‌పై… తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అసమర్ధుడన్నారు. ఇప్పుడు మాత్రం నవీన్ పట్నాయక్‌పై పొగడ్తల వర్షం కురిపించేశాస్తున్నారు. ఫొని తుపాను సహాయ చర్చలు అద్భతంగా తీసుకున్నారంటూ పొగుడుతున్నారు. ఒడిషాలో బీజేపీ గెలిస్తే.. ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ అలాంటి ఆశలేం పెట్టుకోలేదన్నట్లుగా.. వ్యవహరిస్తూ… నవీన్ పట్నాయక్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ బీజేపీ రాజకీయ వ్యూహాలను బయట పెడుతున్నారు.

ఇప్పటికే సమయం మించి పోయిందా..?

మిత్రపక్షాలను దువ్వేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల వెనుక అనేక సమీకరణాలు ఉన్నాయన్న ప్రచారం సహజంగానే వస్తోంది. మోడీ, షాలు ఉంటే.. ఎవరూ రారనే అంచనాలతో వారిని పక్కన పెడతామనే ఫీలర్స్ పంపడమే… ప్రస్తుతానికి రామ్మాధవ్, మురళీధర్ రావులు చేస్తున్న పని అన్న చర్చ నడుస్తోంది. అయితే.. బీజేపీ ఇప్పటికే సమయం మించిపోయిందనేది.. రాజకీయవర్గాలు వేస్తున్న అంచనా. కానీ.. ఈ మాటల వెనుక అసలు వ్యూహం.. కౌంటింగ్ తర్వాతే తెలుస్తుందని… బీజేపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close