ఎక్కడికో … వైసీపీ..! రాబోయే ప్రభుత్వంలో కాబోయే మంత్రులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో కానీ.. తమకు తాము.. గెలుపు మాదే అని చెప్పుకుని… పై నుంచి కింది స్థాయి వరకూ.. అప్పుడే పాలన ప్రారంభించేశారు. ఈ క్రమంలో… బెదిరింపులు లాంటి వాటితో ప్రారంభించి.. చివరికి మంత్రి పదవులు కూడా పంచేసుకున్నారు. మంత్రి పదవుల పంపకాలు.. ఇతర అంశాలు… అంతర్గతంగా.. రూమర్స్‌లా ఉంటే పెద్దగా ప్రాబ్లమ్ ఉండేది కాదు.. ఇప్పుడు అధికారికంగా ఫ్లెక్సీలు కూడా వేసుకుంటున్నారు.

“మినరల్ వాటర్ మినిస్టర్” ఉదయభాను..!

కృష్ణా జిల్లా జగ్గయ్య పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీ చేశారు. ఆయన రాజకీయాల్లో సీనియర్. కానీ రెండు సార్లు ఓడిపోయారు. మూడో సారి కూడా పోటీ చేశారు. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి గెలిపిస్తుందని… ఒక్క చాన్స్ అంటూ ఎన్నికల ప్రచారం చేశారు. పోలింగ్ అయిపోయింది… ఇప్పుడు ఉత్కంఠ తట్టుకోలేకపోతున్నారో… లేకపోతే.. ముందస్తుగా మంత్రి పదవి కోసం స్కెచ్ వేస్తున్నారో కానీ.. ఎండా కాలంలో మినరల్ వాటర్ పంపిణీని ప్రారంభించారు. చలివేంద్రాల్లాంటివి ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పెట్టుకున్న ఫ్లెక్సీల్లో ఇచ్చుకున్న హోదా.. కాబోయే మంత్రివర్యులు సామినేని ఉదయభాను అని. ఆ ఫ్లెక్సీలు చూసి.. ఇంటర్నెట్ కూడా.. భళ్లున నవ్వాల్సి వచ్చింది. వైసీపీ వాళ్ల ఎక్స్ పెక్టేషన్స్.. అంత స్థాయిలో ఉన్నాయని.. సెటైర్లు వేసుకోవడం ప్రారంభించారు.

50 మంది మంత్రులు..! వందల్లో ఎమ్మెల్సీలు..!

ఎన్నికల సమయంలో.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. కనీసం యాభై మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అసలు.. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. మంత్రులుగా చాన్సిస్తామని… జగన్ హామీ ఇచ్చిన వాళ్లే పది మంది వరకూ ఉన్నారట. వాళ్లు పోటీ చేయలేదు కాబట్టి.. ఎమ్మెల్యేగా గెలుపోటములతో సంబంధం లేదు. జగన్ గెలిస్తే చాలు మంత్రి పదవి రావాలి. మర్రి రాజశేఖర్ , నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నటుడు అలీ లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇక… జగన్ నేరుగా ఎమ్మెల్సీ హామీలిచ్చిన వాళ్లు కనీసం నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఉన్నారు. ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు కూడా ఉన్నారు. వీరంతా… ఊహాలోకలంలో విహరిస్తున్నారు. కాబోయే ఎమ్మెల్సీ.. కాబోయే మంత్రి అన్న నేమ్ ప్లేట్లను మనసులో ముద్రించేసుకున్నారు.

అగ్రనాయకత్వమే అలా ఉంది మరి..!

వైసీపీ అగ్రనాయకత్వం వేసుకుంటున్న అతి అంచనాల కారణంగానే.. వైసీపీ క్యాడర్.. కింద నుంచి… అభ్యర్థుల వరకు ఇలా తయారయ్యారన్న అంచనాలు ఉన్నాయి. దీనిపై.. ఎవరూ నోరెత్తలేని పరిస్థితి ఉంది. తాము అధికారంలోకి వస్తామని.. టీడీపీ చేస్తున్న ఈవీఎంలపై ఆరోపణల వల్లే అంచనాకు వచ్చిన వైసీపీ… దాదాపుగా.. పాలన చేస్తున్నామన్న తీరుకు వచ్చేసింది. కానీ.. అంచనాలు తలకిందులైతే… తల ఎక్కడ పెట్టుకోవాలో.. తెలియని పరిస్థితికి చేరుకుంటామన్న భావన చాలా మందిలో వస్తోంది. కానీ అలాంటి వారు వైసీపీలో తక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close