మోడీ, షాలపై మళ్లీ ఆరెస్సెస్ క్యాంప్ పంచ్‌లు..!

” భారతీయ జనతా పార్టీ …. నరేంద్రమోడీ, అమిత్ షాలది కాదు..!” … ఇంత డేరింగ్ స్టేట్‌మెంట్ గత ఐదేళ్ల కాలంలో ఎవరూ విని ఉండరు. ఎన్నికల ఫలితాలకు ముందు బయటకు వచ్చింది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. నితిన్ గడ్కరీ. కేంద్రంలో సీనియర్ మంత్రి. అంతే కాదు.. ఆయనకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ .. ఆరెస్సెస్ సపోర్ట్. కేంద్రంలో ఆరెస్సెస్ ప్రతినిధిగా ఉంటూ వస్తున్న ఆయన కొంత కాలంగా.. మోడీ, షాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు డోస్ పెంచారు.

బీజేపీ మోడీ, షాలది కాదంటున్న గడ్కరీ..!

భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోడీ, అమిత్ షా పేర్లు తప్ప.. ఇతరుల పేర్లు బయటకు వినిపించి, కనిపించి చాలా కాలం అవుతోంది. అయితే కొంత కాలం నుంచి మాత్రం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు బయటకు వస్తోంది. ఆయన కూడా.. మోడీ, షాలపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇది డైరక్ట్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీకి ఓటేయమని ఎవరూ చెప్పడం లేదు. మోడీకి ఓటేయమని అంటున్నారు. ఔక్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటున్నారు కానీ.. బీజేపీ సర్కార్ అనడం లేదు. మోడీకే ఓట్లేయమని.. దేశం మొత్తం అడుగుతున్నారు. ఈ వ్యవహారం ఆరెస్సెస్‌కు కూడా చిరాకేసినట్లుగా ఉంది. అందుకే… బీజేపీ అంటే.. మోడీ, షాది కాదని… గడ్కరీ నేరుగా కుండబద్దలు కొట్టేశారు.

అప్పుడు పరోక్షంగా.. ఇప్పుడు.. డైరక్ట్‌ ఎటాక్‌నా..?

“కుటుంబాన్ని పట్టించుకోనోడు.. దేశాన్నేం పట్టించుకుంటాడు..”పెళ్లాం, పిల్లల్ని చూసుకోకుండా దేశాన్ని ఉద్దరిస్తామంటే నమ్ముతారా..?.. ఇలాంటి సెటైర్లతో పాటు… ఐదేళ్లలో మోడీ ఏమీ చేయలేకపోయారనే సెటైర్లు పరోక్షంగా చాలా వేశారు గడ్కరీ. అప్పట్లో గగ్గోలు రేగింది. ఇలా మోడీ , షాలపై సెటైర్లు వేస్తున్నందుకు రాహుల్ గాంధీ కూడా.. బీజేపీలో ఉన్న ఒకే ఒక్క మగాడు అంటూ అభినందనలు కూడా అందించారు. సోనియా కూడా.. పార్లమెంట్‌లోనే… గడ్కరీని అభినందించారు. ఈ వ్యవహారాలన్నింటి నడుమ ఇప్పుడు.. కొత్తగా గడ్కరీ టోన్ పెంచుతున్నారు. నరేంద్రమోడీపై… ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడం సాధ్యం కాదని… అంచనా వేసిందని.. చెబుతున్నారు. అదే సమయంలో… బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రొత్సహించాలనుకుంటోందని.. అందుకే.. మహారాష్ట్రకే చెందిన … మరో బీజేపీ ముఖ్య నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని హైలెట్ చేస్తోందని చెబుతున్నారు.

మోడీని పక్కన పెట్టాల్సి వస్తే గడ్కరీ రెడీ అయినట్లేనా..?

కేంద్ర కేబినెట్‌లో .. అంతో ఇంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక్క గడ్కరీకే ఉంది. ఆయనకు ఆ శక్తి రావడానికి ప్రధాన కారణం.. ఆరెస్సెస్ మద్దతేననేది బహిరంగ రహస్యం. భారతీయ జనతా పార్టీలోనే.. కొత్తగా.. ప్రధానమంత్రి అభ్యర్థులు తయారయ్యారు. బీజేపీకి… సిద్ధాంతకర్తగా ఉండే.. ఆరెస్సెస్ ప్రొత్సాహంతోనే.. బలమైన పోటీ దారుగా గడ్కరీ తెరమీదకు రావడం అనూహ్య పరిణామమే. ఎన్నికలకు ముందు కానీ.. తర్వాత కానీ.. బీజేపీలో … కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయని.. బీజేపీ నేతల ప్రకటనల ద్వారానే తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close