ద్వివేదీ సడన్ లీవ్..! కేబినెట్ భేటీనే కారణమా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి.. గోపాల కృష్ణ ద్వివేదీ … హఠాత్తుగా లీవ్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి.. ఆయన ఇటు.. సెలవుపై వెళ్లిపోయారు. దీంతో సహజంగానే… అందరిలోనూ అనేక రకాల చర్చలు వినిపించడం ప్రారంభించాయి. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు.. సీఈవో లాంటి అధికారులు ఆదివారాలు కూడా పని చేస్తారు. సెలవులు పెట్టరు. ఇవ్వరు కూడా. కానీ.. ద్వివేదీ వ్యవహారం మాత్రం.. దానికి భిన్నంగా ఉంది. ఆయన సెలవు పెట్టారు. ఇచ్చారు కూడా. మామూలుగా అయితే..ద్వివేదీ సెలవు పెద్దగా చర్చల్లోకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు… ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులతో.. కాస్త చర్చనీయాంశం అవుతోంది.

ఎన్నికల కోడ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు వ్యవహారిస్తున్న తీరు గందరగోళానికి కారణం అవుతోంది. రోజువారీ పాలన సాగకుండా.. గోపాల కృష్ణ ద్వివేదీ.. సీఎస్… ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి.. అధికారులను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు చేసే రివ్యూలు ఎవరూ వెళ్లవద్దని… వెళితే కోడ్ ఉల్లంఘన అన్నట్లుగా చెప్పుకొచ్చిన వారు… ప్రభుత్వం.. డైరక్ట్ ఎటాక్‌కి దిగే సరికి.. తాము.. అలా చెప్పలేదని యూటర్న్ తీసుకున్నారు. ఇక సీఎస్ అయితే.. ముఖ్యమంత్రికి అధికారాలు లేవని మీడియాకే చెప్పడం ప్రారంభించారు. ఈ కారణాలతో… ముఖ్యమంత్రి.. కొంత మంది ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇదే పట్టుదలతో.. చంద్రబాబు… కేబినెట్ భేటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దానికీ.. సీఈవో, సీఎస్ అడ్డు పడే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం పట్టు విడవలేదు. దాంతో.. కేబినెట్ ఎజెండాను.. సీఎస్‌కు తప్పని సరిగా పంపక తప్పలేదు. అలా పంపిన మరుక్షణం ద్వివేదీ సెలవు పెట్టారు. పధ్నాలుగో తేదీన చంద్రబాబు కేబినెట్ భేటీ పెట్టబోతున్నారు. కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత అంటే.. పదహారో తేదీన… ద్వివేదీ మళ్లీ విధుల్లోకి వస్తారు. ఇక కేబినెట్ భేటీ పెడితే ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా.. వెళ్లక తప్పదు. ఆయన కూడా సెలవు పెడతారేమోనన్న చర్చ.. సెక్రేటియట్ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి కోడ్ పేరుతో.. ఏపీలో ఎప్పుడూ లేనంత రాజకీయం నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close