ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అమలు చేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా లే ఔట్లను క్రమబద్దీకరించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ స్కీమ్ గడువు ముగిసేలోపు సమర్పించిన దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 LRS స్కీమ్ కింద, ఆగస్టు 31, 2019కి ముందు రిజిస్టర్ చేసి ప్లాట్లు/లేఔట్లకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. గడువు తర్వాత సమర్పించిన دరఖాస్తులు ఆమోదం కోసం అర్హత పొందవు.
రాష్ట్రవ్యాప్తంగా LRS 2020 కింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. గడువు లోపు సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అనుమతి కోసం పరిశీలిస్తున్నారు. దరఖాస్తు ఆమోదం కోసం అవసరమైన డాక్యుమెంట్లు: రిజిస్టర్డ్ సేల్ డీడ్, లొకేషన్ ప్లాన్, డిటైల్డ్ లేఔట్ ప్లాన్, ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ మొదలైనవి. సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ LRS దరఖాస్తు స్థితిని https://lrsdtcp.ap.gov.in/ వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చు.
గడువు లోపు సమర్పించిన దరఖాస్తులు ప్రాసెసింగ్లో ఉన్నాయి. అనుమతులు/తిరస్కరణలు డాక్యుమెంట్ల సమగ్రత , నిబంధనల అనుగుణంగా జారీ చేస్తారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ గత ప్రభుత్వంలో వచ్చింది. ప్రక్రియ ముందుకు జరగకపోవడంతో ఇప్పుడు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా మళ్లీ ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించాలా లేదా అన్నది త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.