ఆ హీరోయిన్‌తో సాయిధ‌ర‌మ్ అర్థ‌రాత్రి షికార్లు..?

మెగా హీరో సాయిధ‌ర‌మ్ చేసిన సినిమాలు త‌క్కువే అయినా… ఎఫైర్ల విష‌యంలో మాత్రం సీనియ‌ర్ హీరోల్ని మించిపోయాడు. సాయిపై వ‌చ్చే పుకార్లు ఎన్నెన్నో. దానికి త‌గ్గ‌ట్టుగానే సాయిధ‌ర‌మ్ కూడా మీడియాకు అడ్డంగా దొరికిపోతుంటాడు. రెజీనా, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో సాయికి లింకులు క‌డుతూ బోల్డ‌న్ని గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌కీ ప్ర‌గ్యా జైస్వాల్‌కీ మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌న్న గాసిప్ బ‌లంగా వినిపిస్తోంది. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న న‌క్ష‌త్రంలో వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టిస్తున్నారు. ఆ చ‌నువు కొద్దీ… షూటింగ్ అయిపోయాక ఇద్ద‌రూ షికార్ల‌కు బ‌య‌ల్దేరుతున్నారు. దాంతో.. మీడియాలో వీళ్ల‌పై గాసిప్పులు గుప్పుమంటున్నాయి. వాటినీ వీళ్లిద్ద‌రూ కేర్ చేయ‌డం లేదు. తాజాగా మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి జూబ్లీహిల్స్ లోని ఓ నైట్ రెస్టారెంట్‌లో ఇద్ద‌రూ క‌ల‌సి డిన్న‌ర్ చేశారు. అక్క‌డే దాదాపు రెండు గంట‌ల పాటు కూర్చుని క‌బుర్లు చెప్పుకొన్నారు. అన్న‌ట్టు ఆ రెస్టారెంట్‌కి ఎక్కువ‌గా సెల‌బ్రెటీలూ, సినిమా స్టార్లే వ‌స్తుంటారు. అయినా స‌రే… ధైర్యం చేసి – డిన్న‌ర్ పార్టీ ఇచ్చి పుచ్చుకొన్నారు. గాసిప్పుల్లో ఎంత నిజం ఉన్నా, లేకున్నా.. సెల‌బ్రెటీలు ఇలాంటి ప‌బ్లిక్ పార్టీల విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే గాసిప్పుల‌కు గోడ క‌ట్ట‌లేం. అవ‌న్నీ అలా పెరుగుతూ పుట్ట‌ల్లా త‌యార‌వుతాయి. ఆ త‌ర‌వాత స‌మాధానం చెప్ప‌లేక‌… సెల‌బ్రెటీలు జుట్టు పీక్కోవాలి. ఎందుకొచ్చిన గొడ‌వ‌… సాయిధ‌ర‌మ్‌! నువ్వైనా కాస్త కంట్రోల్‌లో ఉండొచ్చు క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com