ప‌ది నిమిషాలు లేపేసిన అశ్వ‌నీద‌త్‌

అశ్వ‌నీద‌త్‌… తెలుగు నాట భారీ చిత్రాల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్స్‌. త‌రం మారినా.. ఆయ‌న మాత్రం అప్‌డేటెడ్ గానే ఉంటారు. త‌న బ్యాన‌ర్‌లో సినిమా అంటే, క‌థ‌.. సంగీతం.. ఇలా అన్ని విష‌యాల్నీ ద‌గ్గ‌రుండి చూసుకొంటారు. `సీతారామం`లోనూ ఆయ‌న భాగ‌స్వామ్యం చాలా ఉంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఆయ‌న కూర్చున్నారు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో దాదాపు ఏడాది ప్ర‌యాణం చేసి.. క‌థ‌ని లాక్ చేశారు. ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూడా ఆయ‌న త‌న అనుభ‌వాన్నిచూపించారు.

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన చిత్రం `సీతారామం`. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. ఆగ‌స్టు 5న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ర‌న్ టైమ్ కూడా లాక్ అయ్యింది. 2 గంట‌ల 37 నిమిషాల సినిమా ఇది. నిజానికి ఫైన‌ల్ ర‌న్ టైమ్ 2 గంట‌ల 47 నిమిషాలు వ‌చ్చింది. సినిమా చూసుకొన్న అశ్వ‌నీద‌త్‌.. ప‌ది నిమిషాలు ట్రిమ్ చేశార్ట‌. ఆడియోలో మొత్తం 9 పాట‌లున్నాయి. అయితే సినిమాలో మాత్రం ఆరు పాట‌లే వినిపిస్తాయి. అశ్వనీద‌త్ అల్లుడు నాగ్ అశ్విన్ కూడా ఫైన‌ల్ కాపీ చూశారు. ఆయ‌న కూడా కొన్ని స‌ల‌హాలు ఇచ్చిన మీద‌ట ఈసినిమాలో ప‌ది నిమిషాల నిడివిగ‌ల సీన్ల‌కు క‌త్తెర ప‌డింది. 2 గంట‌ల 37 నిమిషాలంటే ఈ రోజుల్లో కాస్త ఎక్కువే. కానీ సినిమా బాగుంటే.. నిడివి పెద్ద భారం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బంగ్లాదేశ్ కి సిరీస్ సమర్పించుకున్న భారత్

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ కి షాక్ తగిలింది. మూడు వన్డేల సిరిస్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు సీరిస్ ని కోల్పోయింది. తొలి వన్డే లో ఒక్క వికెట్...

అప్పట్లో వైఎస్ కుయ్.. కుయ్ – ఇప్పుడు కేసీఆర్ టింగ్..టింగ్ !

రాజకీయ నేతలు ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎక్కువగా భాషా ప్రయోగాల్లోనే ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి గెలవడానికి చేసిన కొన్ని ప్రచార ట్రిక్కుల్లో తాను 108...

చంద్రబాబును నమ్మవద్దు ప్లీజ్ – బీసీ సభలో వైసీపీ చెప్పింది ఇదే !

జయహో బీసీ పేరుతో అన్ని జిల్లాల నుంచి జనాలను సమీకరించి విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఇందిరాంధీ స్టేడియం కెపాసిటీ పది వేలు కూడా ఉండదు. అంత చిన్న గ్రౌండ్‌లో పెట్టి ఎనభై వేల...

విజయసాయికి “వైస్ చైర్మన్” హోదా రాక ముందే పోయిందే !

రాజ్యసభలో ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఎనిమిది మందిని నియమిస్తూ రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎనిమిది పేర్లను వెబ్‌సైట్లో అప్ లోడ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఎనిమిదో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close