‘షోలే’లో అమితాబ్‌… ‘ద‌మ్ము’లో వేణు!

స్వ‌యం వ‌రం, చిరున‌వ్వుతో లాంటి సినిమాల‌తో కొన్నాళ్ల పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కి కేరాఫ్ అడ్ర‌స్స్‌గా నిలిచాడు వేణు. ఆ త‌ర‌వాత‌… స‌డ‌న్‌గా మాయ‌మై, మ‌ళ్లీ ఎప్ప‌టికో `ద‌మ్ము`లో తేలాడు. ఎన్టీఆర్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఇది. ఇందులో వేణు ఓ పాత్ర పోషించాడు. దాన్ని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు అన‌లేం.. జూనియ‌ర్ ఆర్టిస్టూ అన‌లేం. ఆ సినిమా త‌ర‌వాత ఆ త‌ర‌హా అవ‌కాశాలు కూడా వేణుకి రాలేదు. ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ `రామారావు ఆన్ డ్యూటీ`లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు వేణు. ఎక్క‌డికి వెళ్లినా త‌న రీ ఎంట్రీ ఘ‌నంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు. తాజాగా ద‌మ్ములో త‌న క్యారెక్ట‌ర్ గురించి కొన్ని స‌ర‌దా కామెంట్లు చేశాడు.

షోలోలే అమితాబ్ లాంటి పాత్ర నీది.. అని ద‌మ్ములో వేణుని తీసుకొన్నాడ‌ట బోయ‌పాటి. ఆ త‌ర‌వాత సంగ‌తి తెలిసిందే. ఎడిటింగ్ లో చాలా సీన్లు లేచిపోయాయి. ”షోలేలో అమితాబ్ పాత్ర అన్నారు. తీరా చూస్తే ఏం జ‌రిగిందో మీకు తెలుసు. ఆ సినిమాలో అమితాబ్ చ‌నిపోయిన‌ట్టు.. ద‌మ్ములో నేను చ‌నిపోతాను. ఈ రెండు సినిమాల మ‌ధ్య పోలిక అదొక్క‌టే” అని త‌న‌పై త‌నే సెటైర్ వేసుకొన్నాడు. అయితే ఆ సినిమా చేసినందుకు ఎప్పుడూ ప్ర‌శ్చాత్తాప‌ప‌డ‌లేద‌ని చెప్పాడు. ”ఇదో ప్ర‌యాణం.. ఆ దారిలో నాకొచ్చిన పాత్ర‌ల్ని గౌర‌వించుకుంటూనే వెళ్లా. ఓ త‌ప్పు చేస్తే… అక్క‌డితో ప్ర‌యాణం ఆగిపోయిన‌ట్టు, దారుల‌న్నీ మూసుకుపోయిన‌ట్టు కాదు క‌దా“ అని చెప్పాడు వేణు. `రామారావు ఆన్ డ్యూటీ`లో సీఐ ముర‌ళిగా క‌నిపించ‌బోతున్నాడు వేణు. “ర‌వితేజ లాంటి స్టార్ సినిమాలో చేయ‌డం ఆనందంగా ఉంది. పెద్ద సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే.. చాలామందికి చేరువ అవుతాను. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమా ఒప్పుకొన్నా” అని చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెదనాన్న మన గుండెల్లో వున్నారు : ప్రభాస్

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్‌ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన...

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close