అలస్కాలో చర్చల సందర్భంగా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించి భలే భయపెట్టాననుకున్న .. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను .. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ జోకర్ ను చేస్తున్నారు. ఓ వైపు యుద్ధ విరమణకు తాను గొప్ప ప్రయత్నాలు చేస్తున్నానని ట్రంప్ చెప్పుకుంటున్నారు కానీ పుతిన్ మాత్రం ఉకక్్రెయిన్ ను వదిలి పెట్టడం లేదు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై డ్రోన్లతో దాడి చేశారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఈ దాడులతో పుతిన్ అమెరికాతో చర్చలను చాలా జోక్ గా తీసుకున్నారని.. తమ డిమాండ్లకు అంగీకరిస్తే తప్ప.. ఉక్రెయిన్ తో రాజీ లేదని తేల్చి చెప్పేసినట్లయింది. పుతిన్ కాల్పుల విమరణ, యుద్ధ విరమణ చేయాలంటే.. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఇచ్చేస్తే యుద్ధం ఆగిపోతుందని.. తనకు నోబెల్ ప్రైజ్ వస్తుందని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం చస్తాం కానీ భూభాగాన్ని వదిలే ప్రశ్నే లేదంటున్నారు.
ఎవరూ తన మాట వినకపోవడంతో ట్రంప్ ఎవరు గుర్తుకు వస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ పైనా అలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ పుతిన్ మాటల రకం కాదు. పుతిన్ పై కోపాన్ని భారత్ పై చూపిస్తున్నారు ట్రంప్. చమురు కొంటోందని పెద్ద ఎత్తున టారిఫ్‌లు వేశారు. కానీ చైనా అంత కంటే ఎక్కువే కొంటోందని ఎందుకు టారిఫ్‌లు వేయడం లేదంటే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ట్రంప్ వ్యవహారం పై స్పష్టమైన అవగాహన ఉన్న పుతిన్.. సమయం చూసి ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు.