స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వాళ్ల దృష్టి `స‌డ‌క్ 2`పై ప‌డింది. ఈ సినిమాకి ద‌ర్శ‌క నిర్మాత‌.. మ‌హేష్ భ‌ట్. సంజ‌య్‌ద‌త్‌, పూజా భ‌ట్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ట్రైల‌ర్ ఈరోజే విడుద‌ల‌చేశారు. ఈ ట్రైల‌ర్‌కి డిజ్ లైక్‌లు వెల్లువ‌గా వస్తున్నాయి. లైకుల కంటే.. డిజ్ లైకులే ఎన్నో రెట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇదంతా.. సుశాంత్ అభిమానుల సెగ‌.

ఈ సినిమాని ఎవ‌రూ చూడొద్ద‌ని.. సుశాంత్ అభిమానులు ప్ర‌తిన బూనారు. అందుకు ఫ‌లిత‌మే ఇన్ని డిజ్ లైకులు. అలాగ‌ని.. ట్రైల‌ర్ బాలేద‌ని కాదు. ఇంట్ర‌స్ట్రింగ్ గానే ఉంది. అయినా.. సరే, సుశాంత్ అభిమానులు ఆగ‌డం లేదు. నెల 28న హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అప్పుడూ.. సుశాంత్ అభిమానులు ఇలానే ఈ సినిమాతో ఆడుకుంటారా? అనే అనుమానాలు మ‌హేష్ భ‌ట్ ని కుదిపేస్తున్నాయి. సుశాంత్ చివ‌రి సినిమా దిల్ బెచారా కూడా హాట్ స్టార్ లోనే విడుద‌లై.. స్ట్రీమింగ్ ప‌రంగా రికార్డులు సృష్టించింది. ఆ సినిమా ట్రైల‌ర్ సైతం వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. ఆ ప్రేమ‌ని.. ఇప్పుడు స‌డ‌క్ 2పై ద్వేషంగా మార్చుకున్నారు సుశాంత్ ఫ్యాన్స్‌. అభిమానుల‌కు కోపం వ‌స్తే అంతే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close