తాత – తండ్రీ – మ‌న‌వ‌డు.. ఇదీ తేజూ క‌థ‌!

మారుతి సినిమా సాయిధ‌ర‌మ్ తేజ్ తో ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు కాన్సెప్ట్‌ల‌తో అల్లుకున్న క‌థ‌లు. అవి మంచి విజ‌యాలన్ని అందించాయి కూడా. అయితే ఈసారి మారుతి.. ఫ్యామిలీ ట‌చ్‌, ఎమోష‌న్స్‌పై న‌డిచే ఓ క‌థ రాసుకున్నాడ‌ని స‌మాచారం. మాన‌వ సంబంధాల్ని అంత‌ర్లీనంగా సృశిస్తూ, త‌న‌దైన కామెడీ పంచ్ ఉన్న క‌థ‌ని సాయిధ‌ర‌మ్ కోసం సిద్ధం చేశాడ‌ట‌. తాత‌- తండ్రి- మ‌న‌వ‌డు మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ఓ తండ్రిని కొడుకు ఎలా మార్చాడు? అనేదే క‌థ అని తెలుస్తోంది.

రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల నేప‌థ్యంలో సాగే సినిమా అని, ప్ర‌స్తుతం లొకేష‌న్ల వేట సాగుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ క‌థ‌కు ఓ విదేశీ సినిమా స్ఫూర్తి అని తెలుస్తోంది. అక్క‌డి క‌థ‌కు, మారుతి త‌న‌దైన శైలిలో ఓ కోటింగ్ ఇచ్చి ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం తేజూ బ‌రువు త‌గ్గే ఆలోచ‌న‌లో ఉన్నాడు. `చిత్ర‌ల‌హ‌రి` కోసం తేజూ బ‌రువు త‌గ్గాల‌నుకున్నాడు. కానీ కుద‌ర్లేదు. ఈసారి మాత్రం – బ‌రువు త‌గ్గాకే షూటింగ్‌కి వెళ్తాడ‌ట‌. జూన్‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com