డైలాగ్ కింగ్ డైరెక్ష‌న్‌

డైలాగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి కుమార్‌. డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, క్యారెక్ట‌ర్ న‌టుడిగా, ప్ర‌తినాయ‌కుడిగా.. త‌న‌లోని చాలా పార్శ్వాలు చూపించారు. హీరోగానూ విజృంభించారు. పోలీస్ క‌థంటే ముందుగా గుర్తొచ్చేది సాయికుమారే. ఇప్పుడు బుల్లి తెర వ్యాఖ్యాత‌గా మారి, గేమ్ షోలు న‌డిపిస్తున్నారు. త్వ‌ర‌లోనే సాయికుమార్ మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పారు.

“చిన్న‌ప్ప‌టి నుంచి క‌థ‌లు చెప్ప‌డం నాకు బాగా అల‌వాటు. అలా క‌థ‌ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడ్ని. ఇప్ప‌టికీ ఆ అల‌వాటు మాన‌లేదు. న‌వ‌ర‌సాలూ ఉండేలా ఓ కుటుంబ క‌థ‌ని త‌యారు చేసుకుంటున్నా. అది స్క్రిప్టు ద‌శ‌లో ఉంది. ఈ క‌థ‌తోనే మెగాఫోన్ ప‌డ‌తా“ అన్నారు. సాయికుమార్ అన‌గానే పోలీస్ స్టోరీ గుర్తొస్తుంది. వ‌చ్చే యేడాదికి ఈ సినిమా విడుద‌లై పాతికేళ్లు. ఈసంద‌ర్భంగా పోలీస్ స్టోరీ సీక్వెల్‌గా `నాలుగో సింహం` అనే సినిమా తీస్తున్నార్ట‌. ఇందులో సాయికుమార్‌, ఆది క‌లిపి న‌టించ‌బోతున్నారు. ఈ చిత్రానికి థ్రిల్ల‌ర్ మంజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను...

బీజేపీ శర్మ గారి జైలు జోస్యం నిజమే..! కాకపోతే రివర్స్‌లో..!

గుజరాత్‌లోని సూరత్‌లో పీవీఎస్ శర్మ అనే మాజీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్, బీజేపీ నేత, ప్రస్తుతం మీడియా కంపెనీ ఓనర్‌ను.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమాలు.. అవినీతికి పాల్పడిన చాలా మందిని...

పంచాయతీ ఎన్నికలకు ఏపీ సర్కార్ సన్నాహాలు..!?

ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టేది లేదని ఏపీ సర్కార్ భీష్మించుకుని కూర్చుంటోంది కానీ. . ఎందుకైనా మంచిదన్నట్లుగా ఏర్పాట్లు మాత్రం చేస్తోంది. రాజ్యాంగ సంస్థ నిర్ణయాన్ని ఎల్ల కాలమూ ధిక్కరించడం సాధ్యం కాదన్న ఉద్దేశమో.....

HOT NEWS

[X] Close
[X] Close