సచివాలాయంపైనే పూర్తి సమయం వెచ్చిస్తున్న కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేస్తే.. దానిపైనే పూర్తి సమయం కేటాయిస్తారు. ఇప్పుడు ఆయన కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం డిజైన్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు గంటల తరబడి…సమీక్షలు చేసిన ఆయన…మంగళవారం మరోసారి సమీక్షలు చేయనున్నారు. అవసరమైన మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ప్లాన్ ప్రకారం.. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కలసి వచ్చేలా ఆరు అంతస్తులు… కట్టాలని అనుకున్నారు. కానీ… ఇప్పుడు మరో అంతస్తు చేరుస్తున్నారు. ఏడు అంతస్తులు కట్టి.. సీఎంవో … ఏడో అంతస్తులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి… సచివాలయం కూల్చివేత ప్రారంభమైన రోజే… కొత్త డిజైన్ ను తెలంగాణ సర్కార్ మీడియాకు పంపింది. అదే ఫైనల్ అని అనుకున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ హాఫిజ్ కాంట్రాక్టర్ దాన్ని డిజైన్ చేశారు. కానీ… అది ప్రాథమిక డిజైన్ మాత్రమే. దానిపై కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నారు. ఇలా చెన్నైకు చెందిన ఓ ఆర్కిటెక్ట్… అన్ని రకాల వాస్తు సలహాలతో.. ఏడు అంతస్తుల డిజైన్ ను అధికారులకు పంపినట్లుగా తెలుస్తోంది. అది కేసీఆర్ కు కూడా నచ్చడంతో దానిపై సమీక్ష చేయనున్నారు.

కరోనా సమయంలో… ప్రజల ప్రాణాలు కాపాడేందుకు… సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో సమయం వెచ్చించాల్సింది పోయి.. కొత్త సచివాలయం అంటూ. .. కాలయాపన చేయడం ఏమిటని… విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే… కేసీఆర్ ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో వైరస్ విస్తరణ తగ్గిందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా.. ఇతర అంశాలను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. చరిత్రలో తెలంగాణ సచివాలయం నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close