భానుమ‌తి మ‌రో గొడవ‌..

వెండితెర‌పై చ‌లాకీ పాత్ర‌ల్లో యువ‌త‌కు గిలిగింతలు పెడుతుంది బాన్సువాడ భానుమ‌తి ఉర‌ఫ్ సాయిప‌ల్ల‌వి. ఈ త‌మిళ సోయ‌గానికి యువ‌త‌రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. వెండితెర‌పై అందం, అభిన‌యంతో మెప్పించే ఈ అమ్మ‌డు ఆఫ్‌ది స్క్రీన్‌లో మాత్రం ఎవ‌రితో అంటీముట్ట‌నట్లుగా ఉంటుందట‌. స‌హ‌న‌టీన‌టుల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోద‌ట‌. ఈ స్వ‌భావ‌మే త‌ర‌చూ ఈ సొగ‌స‌రిపై వివాదాలు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని చెబుతారు. తాజాగా శ‌ర్వానంద్‌తో ఈ అమ్మ‌డికి గొడ‌వ‌లు త‌లెత్తాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరిద్ద‌రు క‌లిసి ప్ర‌స్తుతం ప‌డి ప‌డి లేచె వ‌య‌సు చిత్రంలో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. షూటింగ్ స‌మ‌యంలో శ‌ర్వా, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. సాయిప్ల‌ల‌వి ఇగోయిస్టిక్ ప్ర‌వ‌ర్త‌న‌తో శ‌ర్వా నొచ్చుకున్నాడ‌ట‌. చివ‌ర‌కు యూనిట్ స‌భ్యులు కన్విన్స్ చేయ‌డంతో షూటింగ్‌ను కొన‌సాగించార‌ట‌. గ‌తంలో కూడా హీరో నాగ‌శౌర్య‌తో సాయిపల్ల‌వి గొవ‌డ ప‌డింత‌నే వార్త‌లు వినిపించాయి. సిల్వ‌ర్ స్ర్కీన్‌పై కుర్ర‌కారుని మురిపించే సాయిప‌ల్ల‌వికి ఈ త‌లబిరుసు త‌న‌మెంటోన‌ని సీనియ‌ర్ న‌టీలు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close