అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అదే ఉసురు వాళ్లకి తగిలి అరెస్టులు అవుతున్నారని మాత్రం సజ్జల అనుకోవడం లేదు. పోలీసుల్ని ఐదు సంవత్సరాల పాటు గుప్పిట్లో పెట్టుకుని ఎవరిని అరెస్టు చేయాలో జాబితా రాసుకుని తప్పుడు కేసులు పెట్టి.. శుక్రవారం రాత్రి ఇంటి గోడలు దూకి అరెస్టులు చేసేవారు. అప్పటిదాకా అక్కడే ఉన్నా.. సరే.. ఎక్కడికైనా వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళితే అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి తీసుకు వచ్చేవారు.
అరెస్టులు చేయించడం కాదు..ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారు. ఇలాంటి అరాచకాలు ఐదు సంవత్సరాల కోసం ఎన్ని జరిగాయో లెక్క లేదు. చంద్రబాబు అరెస్ట్ చేయించడానికి ఆడిన నాటకాలకు పొంతన లేదు. చివరికి కేసులో పేరు లేకపోయినా అరెస్టు చేసి అరెస్టు చేసిన తర్వాత .. వ్యవస్థలన్నింటినీ ముందుగానే మేనేజ్ చేసి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదేమిటని ఎవరూ అడగకుండా చేశారు. ఇప్పుడు అరెస్టు అవుతున్న ప్రతి ఒక్కరు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. వారికి సుప్రీంకోర్టు స్థాయిలో బెయిల్ నిరాకరించిన తర్వాతనే అరెస్టవుతున్నారు.
వారు తప్పులు చేశారు కాబట్టే.. ఏ దశలోనూ వారికి రిలీఫ్ లభించడం లేదు. వైసీపీ హయాంలో కనీసం నోటీసులు కూడా ఇచ్చేవారు కాదు. కోర్టుకు వెళ్తారేమో అని శుక్రవారమే ఆస్తులు ధ్వంసం చేసి.. అరెస్టులు చేశారు. ఆ ఉసురు ఇప్పుడు ఖచ్చితంగా తగులుతుందికదా మరి సజ్జల లెక్కల ప్రకారం. వారు చేసిన ఘోరాలకు.. ఇంకెంత ఉసురు బాకీ ఉందో సజ్జలకే తెలియాలి.